Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7లో నాలుగో కంటెస్టెంట్ ఇంటిని వీడే సమయం ఆసన్నమైంది. ఈ వారానికి ప్రియాంక, ప్రిన్స్ యావర్. గౌతమ్, శుభశ్రీ, రతికా రోజ్, తేజా నామినేట్ అయ్యారు. వీరిలో అతి తక్కువ ఓట్లు రతికా రోజ్-తేజాలకు వచ్చినట్లు సమాచారం. వీరిద్దరూ డేంజర్ జోన్లో ఉన్న నేపథ్యంలో రతికా రోజ్ ఇంటిబాట పట్టిందని అంటున్నారు. నిన్నటి నుండి సోషల్ మీడియాలో ఈ మేరకు చర్చ జరుగుతుంది. రతికా రోజ్ ఎలిమినేషన్ దాదాపు ఖాయం అనేది విశ్వసనీయ సమాచారం.
ఫైనల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటుందనుకున్న రతికా రోజ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యిందనే కారణాలు పరిశీలిస్తే… ఆడియన్స్ చాలా ఇంటెలిజెంట్. వాళ్ళను ఫేక్ గేమ్ తో బోల్తా కొట్టించాలనుకుంటే పొరపాటే. నిజాయితీగా తమ వ్యక్తిత్వం బయటపెట్టి ఆడినవాళ్లకు హౌస్లో మైలేజ్ ఉంటుంది. రతికా రోజ్ హౌస్లోకి రావడమే ఓ ప్రణాళికతో వచ్చింది. మొదటి రోజు నుండి తన గేమ్ ప్రణాళిక ప్రకారమే సాగుతుంది. విషయం ఏదైనా ఆమె హైలెట్ అయ్యేలా చూసుకునేది. అందరూ ఎడ్డెం అంటే ఈమె తెడ్డం అంటుంది.
అలాగే ఫేక్ రిలేషన్స్. రతికా ఎవరినీ మనస్ఫూర్తిగా ఇష్టపడదు. స్నేహం చేయదు. ముందొకమాట వెనకొక మాట. పల్లవి ప్రశాంత్ వంటి అమాయకుడిని మొదటి వారం వాడేసింది. నీ హార్ట్ ఎవరికి ఇస్తావ్… నా హార్ట్ నీకు ఇస్తా… అంటూ కబుర్లు చెప్పింది. ఆమె దగ్గర కావడం నిజమే అని నమ్మి పల్లవి ప్రశాంత్ ఆమె చుట్టూ తిరిగాడు. చివరికి నామినేషన్ రోజు ప్లేటు ఫిరాయించింది. ప్రిన్స్ యావర్ విషయంలో కూడా ఇదే చేసింది.
అన్ని విధాలా పవర్ అస్త్ర దక్కే అర్హత అతనికి ఉందని బయట చెప్పింది. కన్ఫెషన్ రూమ్ లో మాత్రం అతనికి అర్హత లేదని ఓటు వేసింది. ఇక పల్లవి ప్రశాంత్ ని రతికా రోజు చాలా తక్కువ చేసి మాట్లాడింది. జనాల్లో సానుభూతి కలిగిన పల్లవి ప్రశాంత్ తో పెట్టుకుని రతికా రోజ్ తప్పు చేసింది. సోషల్ మీడియాలో రతికా రోజ్ మీద తీవ్ర వ్యతిరేకత నడుస్తుంది. రాహుల్ సిప్లిగంజ్ ని మాజీ లవర్ అంటూ ఎమోషనల్ గా వాడేయాలని చూస్తే, అతడు ఆమెకు వ్యతిరేక పోస్టులు పెట్టి పరువు తీశాడు. ఇవన్నీ వెరసి రతికా రోజ్ కి దెబ్బపడింది.