Vijay Deverakonda- Rashmika Mandana: మా మధ్య ఏం లేదంటూనే రష్మిక మందాన చేయాల్సినవి చేస్తుంది. ఆమె చర్యలు కొన్ని రూమర్స్ ని బలపరుస్తున్నాయి. అసలు తనకేమీ సంబంధం లేని సినిమాను ప్రమోట్ చేస్తూ విజయ్ దేవరకొండపై అభిమానం, ప్రేమ చాటుకుంటుంది. విజయ్ దేవరకొండ తమ్ముడు సినిమాను రష్మిక ప్రమోట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ బేబీ. వైష్ణవి చైతన్య హీరోయిన్. ఈ మూవీ టీజర్ విడుదలైంది. రష్మిక మందాన బేబీ టీజర్ లింక్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో పాటు… తనకు నచ్చినట్లు ఎమోజీలు పోస్ట్ చేసింది.

అసలు ఆనంద్ దేవరకొండ సినిమాను రష్మిక ప్రమోట్ చేయడమేంటి? అది కూడా ఆ సినిమాతో ఎలాంటి సంబంధం లేకుండా. పెద్ద హీరోల సినిమా గురించి కూడా స్టార్ హీరోయిన్స్ ట్వీట్స్ వేయరు. అంత అవసరం మనకేంటి అనుకుంటారు. తాము నటించిన సినిమాలను మాత్రమే ప్రమోట్ చేస్తారు. అది కూడా దర్శక నిర్మాతలతో చేసుకున్న ఒప్పందం కారణంగా ఆ మాత్రం సమయం కేటాయిస్తాను.
ఆనంద్ దేవరకొండ కోసం మాత్రం ఆమె ఫ్రీగా పని చేస్తుంది. ఇది ఆనంద్ దేవరకొండపై అభిమానంతో కాదు అనేది వాస్తవం. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ ఆదేశం మేరకు చేస్తుంది. తనకు నచ్చిన మెచ్చిన వ్యక్తి కోరిక మేరకు ఆయన తమ్ముడు మూవీకి ప్రమోషన్స్ కల్పిస్తుంది. మరి రష్మీ ప్రమోషన్స్ బేబీ సినిమాకు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే స్టార్ క్యాస్ట్ లేని బేబీ మూవీని రష్మిక ట్వీట్ చేస్తే మరో పదిమందికి తెలుస్తుంది.

ఇటీవల తనపై వచ్చే రూమర్స్, ట్రోల్స్ ని రష్మిక తీవ్ర స్థాయిలో ఖండించారు. తన ఆవేదన తెలియజేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేస్తూ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. మీడియాలో తాను చేసిన కామెంట్స్ ని కూడా వక్రీకరించారని రష్మిక అభిప్రాయపడ్డారు. విజయ్ దేవరకొండతో ఎఫైర్ వార్తలను ఉద్దేశించి కూడా రష్మిక తన సోషల్ మీడియా పోస్ట్ లో వెల్లడించారు. ఈ రూమర్స్, ట్రోల్స్ సంగతి ఎలా ఉన్నా హీరోయిన్ గా రష్మిక కెరీర్ పీక్స్ లో ఉంది. పుష్ప 2, యానిమల్, వారసుడు వంటి భారీ చిత్రాల్లో రష్మిక నటించారు.
🤗🤗🤗❤️
@ananddeverkonda @sairazesh @SKNonline #Virajashwin @iamvaishnavi04 @MassMovieMakers https://t.co/5XttCsphHZ pic.twitter.com/jCojYYcp3e
— Rashmika Mandanna (@iamRashmika) November 22, 2022