
Rashmika Mandanna : బాలీవుడ్ ఈవెంట్ అంటే చాలు రెచ్చిపోతుంది రష్మిక మందాన. కురచ బట్టలో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో రష్మిక ఆఫ్ స్క్రీన్ డ్రెస్ సెన్స్ హాట్ టాపిక్ అవుతుంది. థైస్ కనిపించేలా మరీ పొట్టి బట్టలు వేసి కాకరేపుతోంది. తాజాగా మరోసారి రచ్చ చేసింది అమ్మడు. బాలీవుడ్ హంగామా అవార్డ్స్ ఈవెంట్ కి స్లీవ్ లెస్ ట్రెండీ వేర్ ధరించింది. ఆ డ్రెస్ టైట్ కావడంతో ఎద అందాలు బయటపడ్డాయి. రష్మిక లుక్ టెంప్ట్ చేస్తుంది. పైగా నా డ్రెస్ ఎలా ఉందంటూ… రివ్యూ అడిగింది.
దీంతో నెటిజెన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరీ అంత టైటా… కనీసం ఊపిరైనా ఆడుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లో రష్మికకు బంగారం లాంటి భవిష్యత్తు కనిపిస్తుంది. అయినా ఆమె ఫోకస్ మాత్రం బాలీవుడ్ పై పెట్టింది. ఇలాంటి ఆలోచనలతో గతంలో ఇలియానా, రకుల్ ప్రీత్ వంటి హీరోయిన్స్ కెరీర్ నాశనం చేసుకున్నారు.

టాలీవుడ్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమగా ఉంది. ఇక్కడ దృష్టి పెడితే రష్మిక కెరీర్ కి ఫుల్ భరోసా ఉంటుంది. నిజానికి రష్మికకు లైఫ్ ఇచ్చింది తెలుగువారే. ఛలో మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామకు వరుస విజయాలు దక్కాయి. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్ర విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి వెళ్లారు. పుష్ప మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టి నేషనల్ క్రష్ గా అవతరించింది.
ఇప్పుడేమో హిందీ పరిశ్రమ అంటూ వేలాడుతుంది. ఆమె హిందీలో నటించిన గుడ్ బై, మిషన్ మజ్ను ఫ్లాప్ అయ్యాయి. అయితే యానిమల్ వంటి భారీ చిత్రం ఆమె ఖాతాలో ఉంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రన్బీర్ కపూర్ హీరో. గ్యాంగ్ స్టర్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. యానిమల్ చిత్రం మీద పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి.

తాజాగా రష్మిక హీరో నితిన్ తో కొత్త ప్రాజెక్ట్ ప్రకటించింది. దీనికి వెంకీ కుడుముల దర్శకుడు కావడం విశేషం. రష్మికతో వెంకీ కుడుములకు వరుసగా ఇది మూడో చిత్రం. ఛలో, భీష్మ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టిన వీరిద్దరూ మరలా కలుస్తున్నారు. అంటే భీష్మ కాంబో రిపీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.