Rashmika Mandana: హీరో హీరోయిన్ జీవితాలు అంత సుఖమైనవేమీ కాదు. నటనలో భాగంగా రిస్క్ చేయాల్సి ఉంటుంది. డాన్స్ లు యాక్షన్ సన్నివేశాలలలో భాగంగా ఒళ్లు నలగ్గొట్టుకోవాలి. అందుకే తరచుగా నటులు గాయాలపాలవుతున్నారు. హీరోయిన్ రష్మిక మందాన కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారట. ఈ విషయాన్ని హైదరాబాద్ కి చెందిన ప్రముఖ డాక్టర్ ఏ వి గురువారెడ్డి స్వయంగా తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన రష్మిక హెల్త్ కండీషన్ గురించి అప్డేట్ ఇచ్చారు. పుష్ప మూవీలో హైలెట్ సాంగ్స్ లో ‘సామీ సామీ’ ఒకటి. ఈ పాటలో రష్మిక వంగి నడుము అటూ ఇటూ కడుపు వేసే స్టెప్ అద్భుతం.

అయితే ఈ స్టెప్పే ఆమెకు తిప్పలు తెచ్చిపెట్టింది. మోకాళ్ళ నొప్పికి కారణమైంది. శరీర బరువు మొత్తం మోకాళ్లపై ఉంచి సామీ సామీ పాటకు రష్మిక వేసిన స్టెప్ కారణంగా ఆమెకు మోకాళ్ళ నొప్పలు వచ్చాయని ఏ వి గురువారెడ్డి అభిప్రాయపడ్డారు. పుష్ప మూవీ చూశాక ఆమెను పర్సనల్ గా కలిసి అభినందించాలి అనుకున్నాను. ఆమెకు మోకాళ్ళ నొప్పులు రావడం వలన ఆ కోరిక తీరిందని ఆయన చెప్పారు. సదరు సోషల్ మీడియా పోస్ట్ లో అల్లు అర్జున్ ఆరోగ్యంపై కూడా ఆయన కామెంట్ చేయడం విశేషం. త్వరలో అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో నా వద్దకు రావొచ్చని, అభిప్రాయ పడ్డారు.
పుష్ప మూవీలో మేనరిజం కోసం అల్లు అర్జున్ లేని గూని నటించాడు. ఒక భుజాన్ని పైకి ఎత్తుకొని సినిమా మొత్తం కనిపించారు. ఈ కారణంగా అల్లు అర్జున్ కి భుజం నొప్పి రావచ్చని ఆయన అంచనా వేశారు. పుష్ప 2 త్వరలో మొదలుకానుండగా మరలా అల్లు అర్జున్ అలానే నటించాల్సి ఉంది. కాబట్టి అల్లు అర్జున్ కి కొంచెం రిస్కే అని చెప్పాలి.ఇక ఏ వి గురువారెడ్డి వరల్డ్ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ జాయిన్ రీప్లేస్మెంట్ ఎక్స్పర్ట్. కాగా రష్మిక ఫిట్నెస్ ఫ్రీక్. ఆమె డైలీ గంటల తరబడి జిమ్ లో కష్టపడతారు. కఠిన కసరత్తులు, బరువులు మోస్తారు. అలాంటి రష్మికకు మోకాళ్ళ నెప్పులంటే నమ్మబుద్ధి కావడం లేదు. స్వయంగా డాక్టర్ నిర్ధారించిన తరుణంలో నమ్మాల్సిందే.

ఇక రష్మిక కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె నటించిన ఫస్ట్ బాలీవుడ్ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 7న విడుదల కానుంది. అమితాబ్ మరో ప్రధాన పాత్ర చేస్తున్న ఈ మూవీ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. అలాగే మిషన్ మజ్ను, యానిమల్ వంటి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో రష్మిక నటిస్తున్నారు. ఇక తెలుగులో పుష్ప 2 చేస్తున్నారు. విజయ్ కి జంటగా వారసుడు చిత్రంలో నటిస్తున్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న వారసుడు తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.