Rashmi and Shekar Master: బుల్లితెర పై సుదీర్ఘకాలంగా యాంకర్ గా రాణిస్తుంది రష్మీ గౌతమ్. జబర్దస్త్ వేదికగా ఆమె వెలుగులోకి వచ్చింది. సుడిగాలి సుధీర్ తో లవ్ ట్రాక్ నడిపింది. సుధీర్ – రష్మీ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఈ జంట బుల్లితెర పై సంచలనం సృష్టించింది.
ఇప్పటికీ సుధీర్ – రష్మీ ప్రేమించుకుంటున్నారు అంటూ వార్తలు వస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వచ్చారు ఈ జంట.
ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉంటున్నారు. కాగా ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా రష్మీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ ఎపిసోడ్ గెస్ట్ గా శేఖర్ మాస్టర్ రావడం విశేషం. దీనికి సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటుంది. అటు రామ్ ప్రసాద్ ఇటు జడ్జ్ ఇంద్రజ… ఇద్దరూ కలిసి ఓ రేంజ్ లో శేఖర్ పై పంచ్లు విసిరారు. వాళ్ళ దెబ్బకు శేఖర్ మాస్టర్ కి ఏం మాట్లాడాలో తెలియక బిత్తర చూపులు చూశాడు.
ఈ ఎపిసోడ్ కి తన టీం తో ఎంట్రీ ఇచ్చిన శేఖర్ మాస్టర్ డాన్స్ తో హోరెత్తించాడు. ఇక పక్కనే ఉన్న రష్మీ తో పులిహోర కలపడం మొదలుపెట్టాడు. మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కి రావడం ఫస్ట్ టైం కదా, అని రష్మీ అడిగింది. అవును .. రోజు రోజుకి .. నీ అందం పెరిగిపోతుంది రష్మీ అంటూ… ఆమె పై చేయి వేశాడు శేఖర్ మాస్టర్. దీంతో రష్మీ మెలికలు తిరుగుతూ తెగ సిగ్గు పడింది. పొగడ్తలకు కరిగిపోయింది. శేఖర్ తో కలిసి స్టెప్పులేసి రచ్చ చేసింది. మధ్యలో ఇంద్రజ కల్పించుకుని డాన్సర్ భూమికలో ఏంటమ్మా ఈ టాలెంట్… మాస్టర్ కే తెలియాలి అంటూ పంచ్ వేసింది.
దీంతో శేఖర్ ఏంటి మేడం టాలెంట్ అంటున్నారు అని అడిగాడు. నేను భూమిక డాన్స్ టాలెంట్ గురించి మాట్లాడుతున్న, మీరు అనుకునే టాలెంట్ ఏంటో నాకు తెలియదు అంటూ ఇంద్రజ ఆయన మతిపోగొట్టింది. డాన్స్ గురించా… భూమిక బాగా చేస్తుంది అని అందరికీ తెలుసు అని శేఖర్ అన్నాడు. అదే మాస్టర్ నేను కూడా అంటున్న అని రష్మీ అంది. మరి వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు అని శేఖర్ అడిగాడు. మీ టాలెంట్ గురించి మాస్టర్ అంటూ రష్మీ అనగానే సెట్ హోరెత్తింది. ప్రోమో చూసిన వారు రష్మీ పక్కనే సుధీర్ ఉంటే బాగుంటుంది .. ఇద్దరిని మళ్ళీ కలిసి చూడాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Web Title: Rashmi gautam and shekar master romantic performance in sridevi drama company
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com