Homeఎంటర్టైన్మెంట్RGV Comments on pawan kalyan speech : ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై...

RGV Comments on pawan kalyan speech : ‘భీమ్లానాయక్’ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగంపై రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్

RGV Comments on pawan kalyan speech : వివాదాలు లేనిదే పూటగడవని రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒకటి రాజేస్తూనే ఉంటాడు. అలా చేయకపోతే ఆయన తిన్న భోజనం కూడా అరుగుతుందో లేదో తెలియదు. నిన్నటి నుంచి మేనియాలా పట్టుకున్న ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుక గురించే ప్రస్తుతం చర్చ సాగుతోంది. అందులో పాల్గొన్న పవన్, కేటీఆర్ ప్రసంగాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రసంగం గురించి చర్చించుకుంటున్నారు.

RGV Comments on pawan kalyan speech
RGV

భీమ్లానాయక్ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అహంకారానికి, ఆత్మ గౌరవానికి మధ్య మడమ తప్పని ఒక యుద్ధమే ఈ సినిమా’ అని పవన్ నర్మగర్భంగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగుతోంది.

Also Read:  క్రేజీ సినిమాలో మాజీ రొమాంటిక్ హీరో

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రసంగంపై తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ వేదికగా పవన్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘భీమ్లానాయక్’ ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎంతో హుందాగా , అద్భుతంగా సాగిందని.. ఆయన ప్రవర్తన, ప్రాతినిధ్యం వహించిన తీరు మర్యాదపూర్వకంగా ఉందన్నారు. అందుకే ఆయన్ని స్టార్స్ అందరిలోకెల్లా పవర్ ఫుల్ అనేది’ అని వర్మ ట్వీట్ చేశారు.

RGV Comments on pawan kalyan speech
RGV Comments On Pawan

అనంతరం మరో ట్వీట్ ను కూడా వర్మ చేశాడు. ‘ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగాల్లో ఇదే దిబెస్ట్. ఎంతో భావోద్వేగంగా.. హృదయపూర్వకంగా.. వినయంగా ఉంది’ అని రాసుకొచ్చాడు.

ఎప్పుడూ నెగెటివ్ కామెంట్స్ చేసే వర్మ.. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్ గా మాట్లాడడం చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. వర్మలోనూ మార్పు వచ్చిందని.. మార్పు మంచిదే అంటూ కామెంట్ చేస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

6 COMMENTS

  1. […] Vadde Naveen: సినిమా రంగం అంటేనే అవ‌కాశాల మీద న‌డిచే ప‌డ‌వ‌. అవ‌కాశాలు రాలేదంటే అక్క‌డికక్క‌డే మునిగిపోతుంది. అయితే టాలీవుడ్‌లో ఎంతో మంది ఎలాంట స‌పోర్టు లేకుండా వ‌చ్చి హీరోలుగా రాణించారు. కానీ సుదీర్ఘంగా ఆ స్టార్‌డ‌మ్‌ను కాపాడుకున్న‌ది మాత్రం కొంద‌రే. చాలామంది మ‌ధ్య‌లోనే కెరీర్‌ను ఆపేసిన వారు ఉన్నారు. అలాంటి వారిలో వ‌డ్డె న‌వీన్ కూడా ఒక‌రు. కోరుకున్న ప్రియుడు మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు న‌వీన్‌. […]

  2. […] Krithi Shetty:  మొదటి సినిమాతోనే పదేళ్ల లైఫ్ ను తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి. టాలీవుడ్‌ లోకి స్టార్ హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చింది. కృతి తన గ్లామర్ షోతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపును తనవైపు తిప్పుకుంది. ఇప్పుడు తెలుగులో నటించేందుకు ఈ భామ ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందట. అమ్మడు అంత డిమాండ్ చేసినా మేకర్స్ డబ్బులు ఇవ్వడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నారు. […]

  3. […] RRR Pre Release Event in Dubai: గ్రేట్ విజువల్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా రానున్న క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. […]

  4. […] Radhe Shyam Song Promo: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే పాటలు బాగా ఆకట్టుకోగా, యువన్‌ శంకర్‌ రాజా పాడిన ఈ రాతలే సూపర్‌ హిట్‌ అయింది. తాజాగా ఈ సాంగ్‌ ప్రోమోని వదిలారు. చేతిలో చేపని పట్టుకొని పూజా వస్తుంటే, ప్రభాస్‌ ఆమెని చూసి ఫీలయ్యే ప్రోమో చాలా క్యూట్‌ గా అనిపిస్తుంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular