Rana Daggubati: విభిన్న నటుడు రానా, తన భార్య మిహీకతో కలిసి మరిచిపోలేని ఓ వేడుకను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ దేనికి వేడుక అనేగా ? కారణం రానా – మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారట. రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నాడు అంటూ ఈ ఉదయం నుంచి వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

కాగా ఇటీవల మిహికా షేర్ చేసిన ఫొటోలో కొద్దిగా బొద్దుగా కనిపించింది. దీంతో అభిమానులు మిహికా మీరు తల్లికాబోతున్నారా..? కొంచెం బొద్దుగా కనిపిస్తున్నారు అని అడిగారు. ‘అలాంటిదేమీ లేదు. పెళ్లి తర్వాత కాస్త బరువు పెరిగానంతే’ అని రిప్లై ఇచ్చింది మిహీకా. కానీ.. ఈ జంట పేరెంట్స్ గా ప్రమోట్ కాబోతుంది అంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Also Read: MGM Hospital: మేం రాము బిడ్డో తెలంగాణ సర్కార్ దవాఖన్లకు..
అసలుకే పెళ్లి కూడా కరోనా కారణంగా చాలా సింపుల్ గా చేసుకున్నారు. మరి కనీసం శుభవార్తను అయినా ఒక వేడుక చేసి ఘనంగా సెలబ్రేట్ చేయకపోతే ఎలా ? అందుకే సురేష్ బాబు కూడా ఈ వేడుకకు ఇండస్ట్రీ పెద్దలు అందర్నీ పిలుస్తున్నారని తెలుస్తోంది. ఇక పెళ్లి జరిగిన దగ్గర నుండి రానా – మిహీక చాలా అన్యోన్యంగా ఉంటున్నారని.. ముఖ్యంగా రానాలో కొత్త మార్పులు చాలా వచ్చాయని కుటుంబ సభ్యులు కూడా ఫీల్ అవుతున్నారు.
ఇదే విషయం గురించి రానా చెప్పుకొస్తూ.. ‘పెళ్లి అయిన తర్వాత ముఖ్యంగా ఈ ఏడాదిలో నా జీవనశైలిలో చాల మంచి మార్పులు వచ్చాయి. నేను ఒకప్పుడు టైంకి తినేవాడిని కాదు, అలాగే మిడ్ నైట్ పార్టీలు కారణంగా నాకు సరైన నిద్ర కూడా ఉండేది కాదు. అయితే, పెళ్లి తర్వాత నుండి నా సతీమణి నా అలవాట్లును పూర్తిగా మార్చేసింది.

ఇప్పుడు నేను టైంకి తింటున్నాను. అలాగే ఎక్కువ సేపు పడుకుంటున్నాను. మొత్తానికి నా జీవితంలో ఇప్పుడు అన్నీ టైంకి జరుగుతున్నాయి. జీవితంలో ఒక స్థిరత్వం వచ్చిన భావన కలుగుతుంది’ అంటూ రానా చెప్పుకొచ్చాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
Also Read: Roja Amabati: ఫైర్ బ్రాండ్స్ రోజా, అంబటికి జగన్ ఎందుకు మంత్రి పదవులు ఇవ్వడం లేదు?