Rana Daggubati: అప్ కమింగ్ వెబ్ సిరీస్లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోయారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా రానా ప్లే బాయ్ రేంజ్ బోల్డ్ సీన్స్ లో నటించాడు. విషయంలోకి వెళితే దగ్గుబాటి హీరోలు వెంకటేష్-రానా కలిసి డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో రానా నాయుడు టైటిల్ తో వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ గా నిర్మితమవుతున్న రానా నాయుడు త్వరలో స్ట్రీమ్ కానుంది. ఈ క్రమంలో టీజర్ విడుదల చేశారు. హీరో వెంకటేష్ లుక్ చాలా భిన్నంగా ఉంది. ఆయన తెల్ల జుట్టు, పెరిగిన గడ్డంలో ఖైదీ గెటప్ లో కనిపించారు. ఇక రానా రూత్ లెస్ రౌడీగా ఉన్నారు.

అయితే రానా నాయుడు సిరీస్లో రానా లిప్ కిస్సులతో రెచ్చిపోయాడు. ఆయన హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేశారని ఆ సీన్స్ చూస్తే అర్థమైపోతుంది. గతంలో రానా ఈ రేంజ్ రొమాంటిక్ అండ్ బోల్డ్ సన్నివేశాల్లో నటించిన దాఖలాలు లేవు. పెళ్ళయాక ప్లే బాయ్ తరహా పాత్రలో ఆయన రెచ్చిపోయి నటించాడు. మరి ఇలాంటి సన్నివేశాల్లో నటించిన రానా వైఫ్ మిహిక బజాజ్ ఫీలింగ్ ఏంటని జనాలు చెవులు కోరుకుంటున్నారు. రానా నాయుడు అమెరికన్ టెలివిజన్ సిరీస్ ‘రే డొనోవన్’ అధికారిక రీమేక్. కెరీర్లో మొదటిసారి బాబాయ్-అబ్బాయికి కలిసి నటించడం మరో విశేషం.
సుర్వీన్ చావ్లా, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై, రాజేష్ జాయిస్, ప్రియా బనెర్జీ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ సిరీస్ దర్శకులుగా కరణ్ అన్షుమాన్, సుప్రం వర్మ వ్యవహరిస్తున్నారు. క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన రానా నాయుడు పై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. ఇక రానా గత చిత్రం విరాటపర్వం నిరాశరపరిచింది. ఆయనకు హిట్ తగిలి చాలా కాలం అవుతుంది. అరణ్య సైతం అనుకున్న స్థాయిలో ఆడలేదు.

మరోవైపు వెంకటేష్ ఎఫ్ 3 మూవీతో ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేశారు. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఎఫ్ 3 లాంగ్ రన్ లో సత్తా చాటలేకపోయింది. కొన్ని చోట్ల ఎఫ్ 3 నష్టాలు మిగిల్చింది. ఇక ‘ఓరి దేవుడా’ టైటిల్ తో తెరకెక్కుతున్న మూవీలో వెంకటేష్ మోడరన్ భగవంతుడిగా కనిపించనున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మిథిలా పాల్కర్ ఆయనతో జతకడుతుంది. ఇది ఓ మై కడవలె అనే తమిళ చిత్ర రీమేక్. అక్కడ విజయ్ సేతుపతి చేసిన రోల్ ఇక్కడ వెంకటేష్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 లాంటి చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. రానా నాయుడు ఆయన నటిస్తున్న డెబ్యూ వెబ్ సిరీస్.