Jr NTR Movie: మూడు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలుతుంది రమ్యకృష్ణ. ఈ సిల్వర్ స్క్రీన్ శివగామి కెరీర్ లో సాధించిన ఘనతలు ఎన్నో ఉన్నాయి. స్టార్ హీరోయిన్ గా దాదాపు 25 ఏళ్ళు చిత్రాలు చేశారు. 1983లో నటిగా ఆమె ప్రస్థానం మొదలైంది. 2000 సంవత్సరం వరకు కూడా హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి. 90 లలో ఆమె కెరీర్ ఫీక్స్ లో ఉంది. తెలుగు, తమిళ్ తో పాటు పలు భాషల్లో విరివిగా చిత్రాలు చేశారు. భరతనాట్యం, కూచిపూడి వంటి కళల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది. అనేక స్టేజ్ షోలు ఇచ్చారు.

విలన్ గా కూడా ఆమె నటించారు. కెరీర్ లో జనం మదిలో గుర్తిండి పోయే నీలాంబరి, శివగామి వంటి పాత్రలు ఆమెకే సాధ్యమయ్యాయి. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేస్తుంది. అనేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేశారు. కమర్షియల్ హీరోయిన్ గా రాణిస్తూనే ఆమె ప్రయోగాత్మక పాత్రలు చేశారు. రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ కూడా సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ఇటీవల రమ్యకృష్ణ లైగర్ మూవీలో హీరో తల్లి పాత్ర చేశారు. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.
కాగా రమ్యకృష్ణ డాన్స్ రియాలిటీ షోకి జడ్జిగా వ్యహరిస్తున్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో డాన్స్ ఐకాన్ పేరుతో ఓ రియాలిటీ షో స్టార్ట్ అయ్యింది. దీనికి శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే రమ్యకృష్ణ మరో జడ్జిగా ఉన్నారు. ఇక రమ్యకృష్ణ నటించిన నా అల్లుడు సినిమాలోని ”సయ్యా సయ్యారే” సాంగ్ కి ఓ కంటెస్టెంట్ డాన్స్ చేశారు. ఈ క్రమంలో ఆమె అలనాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తో ఆ సాంగ్ చేస్తున్నప్పటికి తాను నాలుగు నెలల గర్భవతిని అని చెప్పారు. మామూలుగా ఉన్నోళ్లే ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలంటే భయపడతారు.
మరి నాలుగు నెలల గర్భవతిగా ఎన్టీఆర్ తో సమానంగా స్టెప్స్ వేయడం అంటే మామూలు విషయం కాదు. 2005లో నా అల్లుడు చిత్రం విడుదల కాగా రమ్యకృష్ణ అత్త పాత్ర చేశారు. శ్రీయా, జెనీలియా హీరోయిన్స్ గా నటించారు. ఆ మూవీ అనుకునంత విజయం సాధించలేదు. 2003లో దర్శకుడు కృష్ణవంశీని రమ్యకృష్ణ వివాహం చేసుకున్నారు. దీంతో ఆమె 2004లో గర్భం దాల్చారు. ఆ సినిమా చిత్రీకరణ సమయానికి తాను గర్భవతిని అని తాజాగా బయటపెట్టారు. రమ్యకృష్ణకు ఒక అబ్బాయన్న విషయం తెలిసిందే.