Naga Chaitanya Sobhita : ట్రెండింగ్ లో ఉండే అంశాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో ఉండే సెలబ్రిటీస్ లో ఒకరు రామ్ గోపాల్ వర్మ. తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో ఒకరు ఈయన. నేటి తరం లో సందీప్ వంగ పాన్ ఇండియన్ లెవెల్ లో ఎలా అయితే సెన్సేషన్ సృష్టించాడో, ఆరోజుల్లో రామ్ గోపాల్ వర్మ అలాంటి సెన్సేషన్ సృష్టించాడు. ఆయన తల్చుకుంటే మళ్ళీ ఆ స్థాయికి వెళ్లగలడు కానీ, ఆయన రూట్ మారిపోయింది. ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు అంటూ ఆయన అభిమానులు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు.అయితే రామ్ గోపాల్ వర్మ కి మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన స్టార్ హీరో నాగార్జుననే, చివరి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో కూడా నాగార్జున మాత్రమే. శివ సినిమాతో నాగార్జున ని స్టార్ హీరోల లీగ్ లోకి చేర్చిన రామ్ గోపాల్ వర్మ, ‘ఆఫీసర్’ సినిమాతో నాగార్జున మార్కెట్ మొత్తం డ్యామేజ్ అయ్యేలా చేసి స్టార్ లీగ్ నుండి తప్పించాడు. ఇది అక్కినేని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. అయితే ఇండస్ట్రీ లో ఉన్నటువంటి అందరి హీరోల మీద ఎదో ఒక కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసే రామ్ గోపాల్ వర్మ, నాగార్జున మీద మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ చెయ్యలేదు.
తనకి జీవితం ఇచ్చిన హీరో కాబట్టి ఆయన మీద ఆ కృతజ్ఞత చూపిస్తూ విలువలు పాటించాడు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దీనిపై రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ నాగ చైతన్య శోభిత ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు?, సమంత తో ఎందుకు విడిపోయాడు అనేది మనకి అనవసరమైన విషయం. వాళ్ళ ముగ్గురు మధ్య ఏమి జరిగిందో వాళ్లకి మాత్రమే తెలుసు, మనకి తెలియదు. కానీ మనం ఆ అంశం మీద లేని పోనీ కథనాలు ప్రచారం చెయ్యడం వల్ల, వాళ్ళ ముగ్గురికి ఇబ్బంది. కొన్ని మీడియా చానెల్స్ కి అవసరమైన విషయాలకంటే ఇలాంటి అనవసరమైన విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
యాంకర్ ఆయనని మరో ప్రశ్న అడుగుతూ ‘నాగార్జున గారు మిమ్మల్ని నాగ చైతన్య – శోభిత పెళ్ళికి పిలిస్తే వెళ్తారా’ అని అడగగా, దానికి రాంగోపాల్ వర్మ సమాధానం చెప్తూ ‘నేను వెళ్ళను. నా దృష్టిలో పెళ్లి అయినా, చావు అయినా ఒక్కటే. చావు అంటే ఇప్పటి వరకు మనం జీవించిన స్వేచ్ఛ లోకం నుండి మరో కొత్త ప్రపంచం లోకి వెళ్తాము. అలాగే పెళ్లి కూడా అంతే, అప్పటి వరకు మనకి తెలిసిన స్వేచ్ఛ ప్రపంచం వేరు, పెళ్లి తర్వాత మనకి ఉండే ప్రపంచం వేరు. నాగార్జున ఇలాంటి వాటికి నేను హాజరు అవ్వను అని తెలిసే, నన్ను ఎప్పుడూ ఆహ్వానించడు’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.