https://oktelugu.com/

Ramesh Babu Death: చిన్న ఎన్టీఆర్ లా నటించిన రమేష్ బాబు.. ఆ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమయ్యాడు?

Ramesh Babu Death: కరోనా ఎంట్రీ ఇచ్చాక టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు, టెక్నిషియన్లు వివిధ కారణాలతో మృతిచెందారు. 2021 ఏడాదిలోనూ ఇవే ఛాయలు కన్పిస్తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా సీనియర్ సూపర్ స్టార్ కృష్ణకు కుమారుడి వియోగం కలుగడం శోచనీయంగా మారింది. గత కొద్దిరోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు(56) శనివారం రాత్రి 10:30గంటల సమయంలో మృతిచెందాడు. బాలనటుడిగా, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 9, 2022 / 11:54 AM IST
    Follow us on

    Ramesh Babu Death: కరోనా ఎంట్రీ ఇచ్చాక టాలీవుడ్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖ నటీనటులు, టెక్నిషియన్లు వివిధ కారణాలతో మృతిచెందారు. 2021 ఏడాదిలోనూ ఇవే ఛాయలు కన్పిస్తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. తాజాగా సీనియర్ సూపర్ స్టార్ కృష్ణకు కుమారుడి వియోగం కలుగడం శోచనీయంగా మారింది.

    Ramesh Babu

    గత కొద్దిరోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు(56) శనివారం రాత్రి 10:30గంటల సమయంలో మృతిచెందాడు. బాలనటుడిగా, హీరోగా, నటుడిగా, నిర్మాతగా రమేష్ బాబు అందరికీ సుపరిచితమే. తన తండ్రి కృష్ణ ప్రోత్సాహంతో రమేష్ బాబు ఇండస్ట్రీలోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు.

    1974లో కృష్ణ నటించిన ‘అల్లూరి సీతరామరాజు’ మూవీతో రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కృష్ణ, ఎన్టీఆర్ సినిమాల్లో బాలనటుడిగా కన్పించాడు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ కలిసి నటించిన ‘దేవుడు చేసిన మనుషులు’ మూవీలో చిన్న ఎన్టీఆర్ లా కన్పించాడు. ఆ తర్వాత ‘దొంగలకు దొంగ’, ‘అన్నదమ్ముల సవాల్’ వంటి చిత్రాల్లోనూ నటించాడు.

    ఈక్రమంలోనే కృష్ణ గారు డిగ్రీ పూర్తి చేశాకే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కండిషన్ పెట్టాడట. దీంతో కొన్నేళ్లు రమేష్ బాబు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని రమేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. చదువు పూర్తయ్యాక హీరోగా పరిచయం అయ్యాడు. రమేష్ బాబు మొత్తం 17 సినిమాల చేశారు. చైల్డ్ ఆర్టిస్టుగా, నటుడిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, ప్రొడ్యూసర్ గా వివిధ రంగాల్లో సినీ ఇండస్ట్రీకి సేవలందించారు.

    రమేష్ బాబు మృతి వార్త ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నేడు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. ఏదిఏమైనా టాలీవుడ్లో వరుసగా విషాదాలు ఘటనలు చోటుచేసుకుండటం అభిమానులను కలిచివేస్తోంది.