Ram Charan – The India House : రాంచరణ్.. మెగాపవర్ స్టార్ తన పవర్ చూపిస్తున్నాడు. ఇవాళ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. అయితే అనూహ్యంగా ఈ హీరో ‘ఇండియా హౌస్’ అనే దేశ రాజకీయాలను కుదిపేసే సినిమాను నిర్మిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరూ దీన్ని ఒక సినిమా అనుకుంటున్నారు. కానీ ఇది సినిమా కాదు.. ఒక దేశ ఖ్యాతిని ఎలుగెత్తి చాటేందుకు ప్రయత్నం చేస్తున్న రాంచరణ్ ను ఖచ్చితంగా అభినందించాల్సిందే..
ఎంతో భవిష్యత్ ఉన్న రాంచరణ్‘ఇండియా హౌస్’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్వయంగా నిర్మాతగా మారారు. ఈ సినిమాతో దేశ స్వాతంత్ర్య సమరయోధుడు ‘వీరసావర్కర్’ జీవితం ముడిపడి ఉంది. వీరసావర్కర్ ఆరాధించే వాళ్లు ఎంతమంది ఉన్నారో.. ద్వేషించే వాళ్లు అంతే మంది ఉన్నారు. అంతటి వివాదాస్పద వీరసావర్కర్ జీవిత చరిత్రకు లింక్ అయినటువంటి ‘ఇండియా హౌస్’ చిత్రాన్ని నిర్మించడానికి రాంచరణ్ ముందుకు రావడం అభినందనీయం..
ఇంత చిన్న వయసులో రాంచరణ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరి ప్రశంసలు అందుకుంది. వీరసావర్కర్ సినిమా రాంచరణ్ తీయబోతున్నాడనగానే టాలీవుడ్ లో పెద్ద వివాదాస్పదమైంది. ఎందుకంటే రాహుల్ గాంధీ సైతం వీరసావర్కర్ ను కించపరిచేలా చాలా అనుచితంగా మాట్లాడారు. కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్న సావర్కర్ ను రాంచరణ్ సినిమాగా తీయబోతుండడంతో ఇది పెద్ద వివాదంగా మారింది.
కశ్మర్ ఫైల్స్, కేరళ స్టోరీ లాంటివి దేశంలో వివాదాస్పదమైంది. ఇంతటి కాంట్రవర్సీ సినిమాలు వస్తున్న సమయంలో వీర సావర్కర్ కథను సినిమాగా తీస్తున్న రాంచరణ్ ధైర్యం చేస్తున్నాడనే చెప్పాలి. ఈ సినిమా తీస్తున్నందుకు, రిస్క్ తీసుకున్నందుకు రాంచరణ్ ను అభినందించాల్సిందే.
అసలేంటి ఇండియా హౌస్ సినిమా? దీని కథ ఏంటి? దేశం దృష్టిని ఎందుకు ఆకర్షిస్తోందన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.