Rambha: రంభ.. ఒకప్పటి బోల్డ్ హీరోయిన్ గా వెండితెరను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే, హీరోయిన్ గా చేయడం మానేసాకా, రంభ మధ్యలో కొన్ని పాత్రలలో కనిపించి అలరించినా ఈ మధ్య సినిమాల్లో పెద్దగా యాక్టివ్ గా లేదు. పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే కట్టుబడి పడిపోయింది. అన్నట్టు సినిమాలకు ఎక్కువ గ్యాప్ ఇచ్చాక, మళ్ళీ రిఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ ఏమిటో చుపించాలని ఆశ పడుతుంది.
మొత్తమ్మీద రంభ మళ్ళీ మేకప్ వేసుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. మిడిల్ ఏజ్ దాటేసిన రంభ.. నేటి జనరేషన్ కి తగ్గట్టు.. పర్ఫెక్ట్ గా రెడీ అయిందట. అన్నట్టు ప్రెజెంట్ మ్యాటర్ లోకి వెళ్తే.. రంభ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించింది. ‘అదుర్స్ ఆంటీ’ అనే పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ త్వరలోనే స్టార్ట్ కానుంది.
కొత్త దర్శకుడు ఉదయ్ తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ లో పొలిటిల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. పైగా ఈ వయసులో కూడా రంభ ఈ సిరీస్ కోసం మాస్ స్టెప్స్ వేయబోతుంది. కాగా వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ శరవేగంగా స్టార్ట్ కానుంది. ఈ షూట్ లో రంభతో పాటు మిగిలిన నటీనటులు కూడా పాల్గొనబోతున్నారు.
ఏది ఏమైనా రంభ 90లలో తెలుగు, తమిళ భాషలలో టాప్ స్టార్ గా ఓ ఊపు ఊపేసింది. మరి రంభ మొదటిసారి ఇలా ఓ వెబ్ సిరీస్ చేయడం, పైపెచ్చు రంభ ఈ సిరీస్ లో ఒక రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలాగే రంభ పాత్ర చాలా కామిక్ గా కూడా ఉండనుందని తెలుస్తోంది.
మరి రంభ కామెడీ చేయగలదా..? అదే పెద్ద డౌట్. మాస్ సాంగ్స్ అంటే డాన్స్ బాగా చేస్తోంది.. రెగ్యులర్ సీరియస్ సీన్స్ అంటే.. నటనలో పాతికేళ్ల అనుభవం ఉంది కాబట్టి చేస్తోంది. మరి చూడాలి రంభ వెబ్ సిరీస్ లో ఎలా నటిస్తోందో !!