Ramayana: The Legend Of Prince Rama Movie Review :తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాల్మీకి రామాయణాన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. నందమూరి తారక రామారావు (Nandamuri Tharaka Rama rao) గారు చాలా సినిమాల్లో రాముడిగా నటించి మెప్పించాడు. ఇక ఆయన తర్వాత ఇంకొంతమంది నటులు కూడా రాముడి పాత్రలో నటించి మెప్పించారు…ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా ఎవరు రామాయణం ఆధారంగా సినిమాలు చేసిన కూడా వాటిని ప్రేక్షకులు ఆదరిస్తూనే వచ్చారు. ఇలాంటి సందర్భంలో యానిమేషన్ లో ‘రామాయణం : ‘ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ ‘ (The Legend Of Prince)సినిమా రావడం అనేది నిజంగా సంతోషకరమైన విషయమనే చెప్పాలి. మరి ఇప్పుడు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా రామాయణాన్ని పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ లో రాముడి జననం గురించి తెలియజేశారు. ఇక ఆ తర్వాత రామలక్ష్మణులు తాటకిని చంపడం, సీతాపరిణయం ఆ తర్వాత రామ లక్ష్మణ సీత అరణ్యవాసం, సీతాపహరణం రామ రావణ యుద్ధాన్ని చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సినిమాని కార్టూన్ లో తెరకెక్కించిన కూడా చాలా అద్భుతంగా తీశారు. నిజానికి అందరికీ తెలిసిన స్టోరీ అయినా కూడా చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లడంలో చాలా వరకు సక్సెస్ అయితే అయ్యారు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ చెప్పించడంలో ఇంకాస్త శ్రద్ధ తీసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా రాముడి (Ramudu) ఇంట్రడక్షన్ అలాగే హనుమంతుడు (Hanumanthudu) ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి.
ఈ రెండు సీన్లలో వాళ్ల గురించి భారీగా ఎలివేషన్స్ ఇస్తూ ఒక కమర్షియల్ సినిమాలో హీరోను ఎలాగైతే డైలాగ్స్ తో ఎలివేషన్ ఇప్పిస్తారో ఈ సినిమాలో కూడా అలాంటి ఫార్మాట్ నే వాడారు. మరి ఏది ఏమైనా కూడా మోషన్ పిక్చర్ క్యాప్చర్ లో చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. రామాయణాన్ని ఇప్పటివరకు చూసింది ఒకెత్తయితే ఈ సినిమాను చూడడం వల్ల ప్రేక్షకులు ఎంజాయ్ చేయడమే కాకుండా వాళ్లకు మన పురాణ ఇతిహాసాల గురించి కూడా తెలిసే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ఈ సినిమాని చూసి కార్టూన్స్ ని ఎంజాయ్ చేయడమే కాకుండా రామాయణం గురించి కూడా తెలుసుకునే అవకాశాలైతే ఉంటాయి…ఈ సినిమాలో కొన్ని డ్రాయింగ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మొత్తం సినిమాకి గాను ఒక లక్ష డ్రాయింగ్స్ ని వేసినట్టుగా కూడా సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారమైతే అందింది. నిజానికి ప్రతి ఫ్రేమ్ ను కూడా చాలా అద్భుతంగా తెరకెక్కించి మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా సరిగ్గా వాడుకున్నారు…
