Ramayan Teaser Controversy: నేడు విడుదలైన నితీష్ తివారి(Nitish Tiwari) ‘రామాయణ్'(Ramayan : Part 1) టీజర్ గురించి నేషనల్ వైడ్ గా జరిగిన చర్చ ఇప్పుడు సంచలనంగా మారింది. 4000 కోట్ల రూపాయిల ఖర్చు తో ‘రామాయణ్’ ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ తెగ డప్పు కొట్టారు, కానీ క్వాలిటీ ని చూస్తుంటే కనీసం 400 కోట్లు కూడా ఖర్చు చేసినట్టు లేదు, టీవీ సీరియల్స్ లో ఇంతకంటే బెటర్ ఔట్పుట్ వస్తుంది కదా , ఒక్కసారి హిందీ లో తెరకెక్కించిన రామాయణం , మహాభారతం సీరియల్స్ లోని విజువల్స్ చూడండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అంతే కాదు అప్పట్లో ప్రభాస్ , ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆదిపురుష్’ మూవీ టీజర్ పై ఎన్నో ట్రోల్స్ వేశారు, విజువల్ ఎఫెక్ట్స్ దారుణంగా ఉన్నాయని అన్నారు , కానీ ఈరోజు విడుదల చేసిన ‘రామాయణ్’ టీజర్ లోని విజువల్స్ కూడా అలాగే ఉన్నాయని అంటున్నారు నెటిజెన్స్.
ముఖ్యంగా రాక్షసుల షాట్స్ కార్టూన్ లాగా అనిపించాయని , ‘ఆదిపురుష్’ లోని రాక్షసులను చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో , ఈ టీజర్ లోని రాక్షసుల షాట్స్ ని చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందని, అంతే కాకుండా కొన్ని షాట్స్ అయితే ‘ఆదిపురుష్ నుండి కాపీ చేసి ఈ టీజర్ లో పెట్టినట్టుగా అనిపించింది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూపించిన టీజర్ లో బంగారు జింక షాట్ ని మీరంతా చూసే ఉంటారు. ఆ షాట్ , ఆదిపురుష్ చిత్రం లోని షాట్ ఒకేలా ఉంది. దానిని మీరు క్రింద చూడొచ్చు. బంగారు జింక ఏ సినిమాలో అయినా ఒకేలా ఉంటుంది, అంత మాత్రానా ఇది పలానా సినిమా నుండి కాపీ కొట్టారు అనడం హాస్యాస్పదం అంటూ సోషల్ మీడియా లో బాలీవుడ్ అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు.
ఈ చిత్రాన్ని మేకర్స్ 200 కోట్లు , లేదా 400 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాము అని పబ్లిసిటీ చేసుకొని ఉండుంటే , ఈ రేంజ్ ట్రోల్స్ ఉండేవి కాదని, కానీ 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నామని చెప్పారు , ఇది పచ్చి అబద్దం , అందుకే ఈ రేంజ్ ట్రోల్స్ వస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని వాల్మీకీ రామాయణం ఆధారంగానే తెరకెక్కిస్తున్నారట. ‘ఆదిపురుష్ ‘ తరహా లో రామాయణం ని నా ఇష్టమొచ్చినట్టు తెరకెక్కిస్తాను అనే ధోరణి తో తెరకెక్కించిన సినిమా కాదట. రామాయణం గాథలో పీక్ ఎమోషన్ ఉంటుంది. దానిని వెండితెర పై అద్భుతంగా పండిస్తే , బాక్స్ ఆఫీస్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి, నితీష్ తివారీ అదే చేసాడని, ఈ దీపావళి కి మీరంతా ఆయన దర్శకత్వ ప్రతిభ చూసి సెల్యూట్ చేస్తారంటూ బాలీవుడ్ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.
