https://oktelugu.com/

Ramarao On Duty Pre Release Event: అతను దక్షిణ భారత దేశంలోనే గొప్ప నటుడు – రవితేజ

Ramarao On Duty Pre Release Event: డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో రవితేజ చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడారు. ఎప్పుడూ సరదాగా ఉండే రవితేజ.. ఈ ఈవెంట్ లో కూడా అలాగే కనిపించారు. ఇంతకీ ఈ ఈవెంట్ లో రవితేజ ఏమి […]

Written By:
  • Shiva
  • , Updated On : July 25, 2022 / 09:38 AM IST
    Follow us on

    Ramarao On Duty Pre Release Event: డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ వేడుకకు నాని ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో రవితేజ చాలా ఎనర్జిటిక్ గా మాట్లాడారు. ఎప్పుడూ సరదాగా ఉండే రవితేజ.. ఈ ఈవెంట్ లో కూడా అలాగే కనిపించారు.

    Ravi teja, Nani

    ఇంతకీ ఈ ఈవెంట్ లో రవితేజ ఏమి మాట్లాడారో తెలుసా ?, ఆయన మాటల్లోనే విందాం. ‘ఈ సినిమాకు సంబంధించి నేను అందరు టెక్నీషియన్స్‌తో కలిసి నటించడం ఇదే మొదటిసారి. 90ల నాటి గెటప్ ను ప్రామాణికంగా చూపించడం జరిగింది. ఈ సినిమా ఎడిటర్ ప్రవీణ్ కెఎల్ జాతీయ అవార్డు గ్రహీత. సత్యన్ సూర్యన్ ఈ సినిమాకు యాప్ట్. ఆయన మనకు లభించడం మన అదృష్టం.

    Also Read: Nani- Ravi Teja: చిరంజీవి రవితేజకు స్ఫూర్తి అయితే, మాకు రవితేజ స్ఫూర్తి – నాని

    సామ్ సిఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందించడం జరిగింది. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడిగా శరత్ బాగా పని చేసాడు. ఇంతకు ముందు నేను ప్రయత్నించని పాత్రను ఈ సినిమాలో ట్రై చేయడం జరిగింది. నాకు ఇది మొదటి సినిమా అన్నంతగా ఈ సినిమా కోసం నేను పని చేశాను. ఇక ఈ చిత్రం నిర్మాత సుధాకర్ చాలా కూల్ ప్రొడ్యూసర్.

    Ravi teja, Nani

    ఆయనతో చాలా సినిమాలు చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు నటించారు. వారి లుక్‌ చాలా బాగుంది. అన్వేషి జైన్ పాటలో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇక నాని విషయానికి వస్తే.. తను అంటే నాకు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా చాలా ఇష్టం. అతను దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ నటులలో ఒకడు. ఈ విషయం అందరికీ తెలుసు.

    ఈ సినిమాలో వేణు నటించడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. వేణుతో నేను స్వయంవరం సినిమా చేసే అవకాశం మిస్ అయ్యాను. ఎట్టకేలకు మేము ఇద్దరం ఇన్నాళ్లకు కలిసి ఓ సినిమా చేశాం. ఇక నుంచి వేణు సినిమాలు ఎక్కువగా చేయాలి. ప్రతి సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోడు అని నేను ఆశిస్తున్నాను’ అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జాతకం ఎలా ఉంటుందో ? ఈ చిత్రం ఏ రేంజ్ జాతర చేస్తుందో చూడాలి.

    Also Read:Pawan Kalyan- Shobhan Babu: పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబినేషన్ లో మిస్ అయినా సినిమా ఏమిటో తెలుసా?

    Tags