Rama Rao on Duty Collections: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ బాక్సాఫీస్ వద్ద పూర్తిగా తేలిపోయింది. నాలుగో రోజు కూడా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి. డైరెక్టర్ శరత్ మండవ పేలవమైన దర్శకత్వం ఈ సినిమాకి శాపంగా మారింది. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్స్ ఏమీ బాగాలేదు. ఇంతకీ అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?, నిర్మాతకు ఏ రేంజ్ నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. చూద్దాం రండి.
ముందుగా ఈ సినిమా 10 రోజుల కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.
నైజాం 1.27 కోట్లు
సీడెడ్ 0.79 కోట్లు
ఉత్తరాంధ్ర 0.61 కోట్లు
ఈస్ట్ 0.37 కోట్లు
వెస్ట్ 0.39 కోట్లు
గుంటూరు 0.41 కోట్లు
కృష్ణా 0.33 కోట్లు
నెల్లూరు 0.43 కోట్లు
ఏపీ + తెలంగాణలో 10 రోజుల కలెక్షన్స్ గానూ 4.50 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 9.01 కోట్లు వచ్చాయి.
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.94 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ గా 10 రోజుల కలెక్షన్స్ గానూ 5.43 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా 10 రోజుల కలెక్షన్స్ గానూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ రూ. 10.75 కోట్లను కొల్లగొట్టింది
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల 20 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, మొదటి 10 రోజులకు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బాగా డిజప్పాయింట్ చేసింది. ఒక విధంగా ఇంత దారుణమైన కలెక్షన్స్ రవితేజ కెరీర్ లోనే రాలేదు. సహజంగా రవితేజ సినిమాకి ఓపెనింగ్స్ బాగానే వస్తాయి. కానీ ఈ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మాత్రం భారీ డిజాస్టర్ గా నిలిచింది. 19 కోట్లు వరకు ఈ సినిమాకి నష్టం రావొచ్చు.