Director Lingusamy: తమిళనాడు లో మాస్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ ని సంపాదించిన దర్శకుడు లింగుస్వామి..ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్స్ గా నిలిచాయి..మన టాలీవుడ్ లో VV వినాయక్, బోయపాటి శ్రీను వంటి వారు ఎంతో గొప్ప మాస్ డైరెక్టర్స్ గా పేరు తెచుకున్నారో..తమిళనాడు లో లింగుస్వామి అలా అన్నమాట..ఆయన టీకెక్కించిన ఆవారా మరియు పందెం కోడి వంటి సినిమాలు తెలుగు లో కూడా దబ్ అయ్యి ఘన విజయం సాధించాయి..ఆ సినిమాల ద్వారా లింగు స్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే..ఇటీవలే ఈయన ఎనెర్జిటిక్ స్టార్ రామ్ తో ‘ది వారియర్’ అనే సినిమాని తెలుగు మరియు తమిళ బాషలలో తెరకెక్కించాడు..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..అదంతా పక్కన పెడితే గత కొంతకాలం నుండి ఈయన చెక్ బౌన్స్ కేసు లో ఇరుక్కున్నాడు..నిన్న చెన్నై కోర్టు ఈ కేసు విషయం లో లింగుస్వామి కి షాక్ తగిలేలా తుది తీర్పు ఇచ్చింది,
ఇక అసలు విషయానికి వస్తే లింగు స్వామి కార్తీ మరియు తమన్నా ని హీరో హీరోయిన్లు గా పెట్టి ‘ఎన్ని యేళు నాల్’ అనే సినిమాని తీద్దాం అనుకున్నాడు..అప్పట్లో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు కూడా..ఇందుకోసం ప్రముఖ నిర్మాత PVP నుండి కోటి రూపాయిలు అప్పు కూడా తీసుకున్నారు..కానీ ఎన్ని రోజులైనా షూటింగ్ ప్రారంబించకపోవడం తో ఇచ్చిన డబ్బు మొత్తం వడ్డీ తో సహా ఇవ్వాలంటూ పీవీపీ డిమాండ్ చేసాడు.
ఆయన అడగంగానే చెక్ రాసి ఇచ్చాడు లింగుస్వామి..కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది..దీనితో ఆగ్రహం తెచ్చుకున్న పీవీపీ లింగుస్వామి మరియు అతని సోదరుడు సుభాష్ చంద్ర బాస్ పై కోర్టు లో కేసు వేసాడు..గత కొద్దీ రోజుల నుండి నడుస్తున్న ఈ కేసు ని బాగా పరిశీలించి నిన్న లింగుస్వామి మరియు అతని తమ్ముడు సుభాష్ చంద్రబోస్ కి 6 నెలలు జైలు శిక్ష విధిస్తున్నట్టు చెన్నై లోని సైదా పేట్ కోర్టు చివరి తీర్పు ఇచ్చింది..ప్రస్తుతం ఈ వార్త తమిళనాడు లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
Also Read:Anchor Manjusha: ఉల్లిపొర లాంటి చీరలో స్టార్ యాంకర్ : అందాలన్నీ బయట పడ్డాయి.. షాక్ లో నెటిజన్లు !