Homeఎంటర్టైన్మెంట్Ram Prasad : జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ కి ఘోర అవమానం, శివాజీ అంత...

Ram Prasad : జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ కి ఘోర అవమానం, శివాజీ అంత మాట అనేశాడేంటి?

Ram Prasad : బుల్లితెర స్టార్ కమెడియన్స్ లో ఆటో రామ్ ప్రసాద్ ఒకడు. తన ఆటో పంచ్ లతో ఆయన ఫేమస్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ టీం లో ఆటో రామ్ ప్రసాద్ స్కిట్స్ చేసి ఫేమస్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ టీంకి ఆటో రామ్ ప్రసాద్ స్కిట్స్ రాసేవాడు. ఆటో రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులది బ్లాక్ బస్టర్ కాంబినషన్. వీరి స్కిట్ కోసమే జబర్దస్త్ చూస్తే ఆడియన్స్ కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిశారంటే నవ్వులు పూయాల్సిందే. దశాబ్దం పాటు వీరు బుల్లితెర ఆడియన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచారు.

Also Read : యాక్సిడెంట్ కి గురైన జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ కారు..ప్రస్తుతం ఆయన పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను జబర్దస్త్ ని వదిలేశారు. సుడిగాలి సుధీర్ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన నటించిన గాలోడు మూవీ హిట్ కావడం విశేషం. ఇటీవల కొంచెం గ్యాప్ వచ్చింది. దాంతో యాంకర్ గా తిరిగి షోలు చేస్తున్నాడు. కమెడియన్ గా గెటప్ శ్రీను కెరీర్ మాత్రం బాగుంది. పలు హిట్ చిత్రాల్లో గెటప్ శ్రీను కీలక పాత్రలు దక్కించుకుంటున్నాడు. కమెడియన్ గా గెటప్ శ్రీను సెటిల్ అయ్యాడు. రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ నే నమ్ముకుని అక్కడే ఉండిపోయాడు. తాను టీమ్ లీడర్ గా మారి, స్కిట్స్ చేస్తున్నాడు.

రామ్ ప్రసాద్ పంచ్ లకు సుడిగాలి సుధీర్ రియాక్షన్స్, గెటప్ శ్రీను గెటప్స్ తోడు కావడంతో అవి పేలేవి. ప్రస్తుతం రామ్ ప్రసాద్ ఆటో పంచ్ లు ఏమంత నవ్వు తెప్పించడం లేదు. తాజా ఎపిసోడ్ లో రామ్ ప్రసాద్ కి ఒకింత అవమానం జరిగింది. జడ్జి శివాజీ.. రామ్ ప్రసాద్ ని స్క్రాప్(చెత్త) అనేశాడు. స్కిట్ లో భాగంగా స్క్రాప్ కొనుగోలు చేసే దుకాణం యజమాని పాత్ర వేశాడు రామ్ ప్రసాద్. దాంతో శివాజీ.. అంటే రామ్ ప్రసాద్ స్క్రాపా, అనేశాడు. ఆ మాటకు రామ్ ప్రసాద్ రియాక్షన్ మారిపోయింది.

Also Read : ఆటో రామ్ ప్రసాద్ కి క్యాన్సర్… స్వయంగా క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్! 

సీనియర్ కమెడియన్ అయిన రామ్ ప్రసాద్ ని చెత్త అని జడ్జి శివాజీ అనడం చర్చకు దారి తీసింది. అయితే అది స్కిట్ లో భాగమే. అయితే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ నిజంగా స్క్రాప్ గా మిగిలిపోయాడనే వాదన వినిపిస్తుంది. తన తోటి కమెడియన్స్ గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ నటులుగా సిల్వర్ స్క్రీన్ పై రాణిస్తుంటే, రామ్ ప్రసాద్ మాత్రం జబర్దస్త్ కే పరిమితం అయ్యాడని అంటున్నారు. ఆటో రామ్ ప్రసాద్ సైతం సినిమాలు చేశాడు. కానీ ఆయనకు బ్రేక్ రాలేదు.

RELATED ARTICLES

Most Popular