Ram Pothineni : మన టాలీవుడ్ లో స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్నప్పటికీ, సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల ఇప్పటికీ మీడియం రేంజ్ హీరో గా మిగిలిపోయిన వారిలో ఒకరు రామ్ పోతినేని(Ram Pothineni). మొదటి చిత్రం ‘దేవదాసు’ తోనే చరిత్ర సృష్టించాడు. ఎవరీ కుర్రాడు, చిచ్చర పిడుగులాగా కనిపిస్తున్నాడు. కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతాడని మొదటి సినిమాతోనే అందరు అంచనా వేశారు. మంచి అందం, అద్భుతమైన ఎనెర్జిటిక్ నటన, చూపులు తిప్పుకోలేని డ్యాన్స్, మెరుపు వేగంతో చేసే ఫైట్స్, ఇలా ఒక్కటా రెండా ఎన్నో విశేషాలు ఉన్నటువంటి హీరో ఆయన. కానీ ఎంత టాలెంట్ ఉండి ఏమి ప్రయోజనం?, సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం వల్ల అతని కెరీర్ రెండు దశాబ్దాల నుండి మీడియం రేంజ్ కి పరిమితమైంది. ఒక భారీ హిట్ పడుతుంది, ఇక ఆ తర్వాత మరో హిట్ పడితే స్టార్ అయిపోతాడు అనుకునేలోపు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ వస్తాయి.
Also Read : యంగ్ హీరోయిన్ తో రామ్ పోతినేని డేటింగ్..అడ్డంగా దొరికిపోయాడుగా..2 నెలల సమయంలోనే ఒక్కటైపోయారా
దీంతో అభిమానులు ఆశించిన రేంజ్ కి వెళ్లలేకపోతున్నాడు. ఉదాహరణకు ఆయన పూరి జగన్నాథ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా రామ్ కి మాస్ ఆడియన్స్ లో వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ఇంకొక్క భారీ హిట్ పడితే మరో లెవెల్ కి వెళ్ళిపోతాడు అని అందరూ అనుకుంటున్న సమయంలో వరుసగా నాలుగు డిజాస్టర్ ఫ్లాప్స్ పడ్డాయి. కెరీర్ ప్రారంభం నుండి ఇదే నడుస్తుంది. ఇది రామ్ బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇకపోతే గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ డైరెక్టర్ మహేష్ బాబు(P.Mahesh Babu) తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం పై అభిమానుల్లో,ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. రామ్ లుక్స్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో రామ్ ఇంత అందంగా కనిపించలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే(Bhagya Sri Bhorse) నటిస్తుంది. అయితే ఈ చిత్రంలో రామ్ ఒక లవ్ సాంగ్ కి రచయితా గా వ్యవహరించాడట. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. రామ్ లో ఎన్నో టాలెంట్స్ ఉన్నాయని తెలుసు కానీ, ఇలాంటి టాలెంట్ కూడా ఉందని మాత్రం ఇప్పుడే అభిమానులకు కూడా తెలిసింది. ఇది నిజంగా ఆయన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్. చూడాలి మరి ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నట్టు గానే ఈ పాట నిజంగా క్లిక్ అవుతుందా లేదా అనేది.