Fans of star heroes vs Ram Pothineni: ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) కి ఈమధ్య కాలం లో సరైన హిట్ తగలడం లేదు. చేసిన సినిమాలు యావరేజ్ అయినా పర్వాలేదు కానీ, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి. ఆయన గత చిత్రం డబుల్ ఇష్మార్ట్ ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. రామ్ మార్కెట్ కి పెద్ద గండి కొట్టింది ఈ సినిమా. ఇప్పుడు ఆయనకు కచ్చితంగా ఒక భారీ హిట్ కావాలి, లేదంటే పూర్తిగా మార్కెట్ పోయినట్టే. అందుకే ఈసారి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra king Thaluka) స్క్రిప్ట్ ని ఎంచుకున్నాడు. ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న మహేష్ బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ భొర్సే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఒక సూపర్ స్టార్ వీరాభిమాని కథ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఒక పాట విడుదలై పెద్ద హిట్ అయ్యింది. గ్లింప్స్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ చిత్రం నుండి ‘పప్పీ షేమ్’ అనే రెండవ పాటని ఈ నెల 8న విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు స్వయంగా రామ్ పోతినేని గాత్రం అందించాడు. కాసేపటి క్రితమే ఈ పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఈ చిన్న ప్రోమో సాంగ్ ని విన్న తర్వాత రామ్ లో ఇంత మంచి సింగర్ ఉన్నాడా అని ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కంటెంట్ ని ఏ యాంగిల్ లో చూసినా సూపర్ హిట్ లాగానే అనిపిస్తుంది. రామ్ కం బ్యాక్ ఈసారి భారీ రేంజ్ లోనే ఉండబోతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే రామ్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని చాలా డిఫరెంట్ యాంగిల్ లో చేయబోతున్నాడు. పది రోజుల క్రితమే ఆయన ఒక ట్వీట్ వేస్తూ ‘డియర్ మెగా, లయన్, కింగ్, విక్టరీ, పవర్, సూపర్, రెబల్, మెగా పవర్, స్టైలిష్ ఫాన్స్ మరియు నా ఫ్యాన్స్..మిమ్మల్ని మీరు వెండితెర మీద చూసుకునే సినిమా ఇప్పటి వరకు రాలేదు కదా?, రెడీ అవ్వండి నవంబర్ 28 న థియేటర్స్ లో మిమ్మల్ని మీరు చూసుకోబోతున్నారు’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ ట్విట్టర్ లో పెద్ద దుమారమే రేపింది. ఎందుకంటే రామ్ హీరోలకు సంబంధించిన ట్యాగ్స్ ని ఒక ర్యాంకింగ్ ఆర్డర్ లో ఇచ్చాడని, అలా చూసుకుంటే నేటి తరం స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ నెంబర్ 1 అని, మిగిలిన హీరోలు ఆయన తర్వాతే అనే అర్థం వచ్చేలా ఉందని ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలివేషన్స్ వేసుకోవడం, మరో పక్క ఇతర హీరోల అభిమానులు వాళ్లకు కౌంటర్లు ఇవ్వడం, ఇలా అందరి మధ్య గొడవలు క్రియేట్ చేసింది ఈ ట్వీట్. రాబోయే రోజుల్లో ప్రొమోషన్స్ పేరుతో ఇంకెన్ని గొడవలు పెడుతాడో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.