Ram Pothineni : యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ సమానమైన క్రేజ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోలలో ఒకడు రామ్ పోతినేని(Ram Pothineni). స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టేంత సత్తా ఉన్న హీరో ఈయన. కానీ ఒక హిట్ పడితే, వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ కొట్టడం ఇతనికి అలవాటు అయిపోయింది. అందుకే టాలెంట్ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ లోకి వచ్చి రెండు దశాబ్దాల సమయం పట్టినా ఇప్పటికీ మీడియం రేంజ్ మార్కెట్ తోనే కొనసాగుతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం తర్వాత ఈయన చేసిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి చిత్రాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. దీంతో రామ్ మార్కెట్ మళ్ళీ రిస్క్ లో పడింది. ఇప్పుడు ఆయన ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ డైరెక్టర్ మహేష్ బాబు(Mahesh Babu) తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇందులో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ భోర్సే(Bhagyasri Bhorse) హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదంతా పక్కన పెడితే హీరో రామ్ టాలీవుడ్ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడు. అమ్మాయిలలో ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఒకప్పుడు ఈయన అనుపమ పరమేశ్వరన్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వినిపించాయి. కానీ అవి కేవలం రూమర్స్ మాత్రమే అని అటు రామ్, ఇటు అనుపమ కొట్టిపారేశారు. ఆ తర్వాత రామ్ కి పెళ్లి కూడా అయిపోయింది అంటూ రూమర్స్ వినిపించాయి, వీటిపై కూడా రామ్ స్పందించి ఖండించాడు. కానీ ఇప్పుడు ఈయన భాగ్యశ్రీ భోర్సే తో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రం రూమర్ కాదు, నిజమే అని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. రెండు నెలల నుండి వీళ్లిద్దరు కొత్త సినిమా చేస్తూ ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఈ తక్కువ సమయంలోనే వీళ్లిద్దరి మనసులు కలిసినట్టు తెలుస్తుంది.
రామ్ ఎంతో మంది క్రేజీ హీరోయిన్స్ తో పని చేసాడు. వాళ్ళతో ఆయనకు మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. అంతమందిలో కనిపించనిది భాగ్యశ్రీ లో కనిపించింది ఏమిటి అని అభిమానులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ జోడి చాలా క్యూట్ గా ఉంటుందని, భాగ్యశ్రీ లాంటి అందమైన అమ్మాయిని దక్కించుకున్నందుకు రామ్ చాలా లక్కీ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు కలిసి ముంబై లో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారట. అక్కడే వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుందని సమాచారం. చూడాలి మరి వీళ్ళ ప్రేమ పెళ్లి పీటలు వరకు వెళ్తుందా?, లేదా మధ్యలోనే బ్రేకప్ అవుతుందా అనేది. భాగ్యశ్రీ మొదటి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ ఘోరమైన ఫ్లాప్ అయ్యినప్పటికీ, ఆమె అందానికి ఫిదా అయిపోయారు కుర్రాళ్ళు. ఇంత అందమైన ముఖం ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోయిన్ కి కూడా లేదని ప్రశంసల వర్షం కురిపించారు.