Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు ఎవరికీ అందవు. ఇక ఆయన కన్ను పడితే సామాన్యులు కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. అరియనా, ఇనయ సుల్తానా అలాగే పాప్యులర్ అయ్యారు. బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కించుకున్నారు. అంకిత మహారణా అనే ఫేడ్ అవుట్ హీరోయిన్ ని, అప్సరా రాణిగా పేరు మార్చి ఫేమస్ చేశాడు. తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చాడు. ఈసారి ఓ సోషల్ మీడియా సెలెబ్రిటీని హీరోయిన్ చేశాడు. చీర కట్టులో బాపు బొమ్మలా ఉన్న ఒక అమ్మాయి దర్శకుడు వర్మ కంట్లో పడింది.
చేతిలో కెమెరా పట్టుకొని రొమాంటిక్ గా ఉన్న ఆమె బాడీ లాంగ్వేజ్ వర్మను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ శారీ గర్ల్ ఎవరో వివరాలు చెప్పాలని వర్మ సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేశాడు. అలా ఆ అమ్మాయి పేరు, వివరాలు రాబట్టాడు. కేరళకు చెందిన ఆ శారీ గర్ల్ పేరు శ్రీలక్ష్మి సతీష్. ఇంస్టాగ్రామ్ లో రొమాంటిక్ ఫోటోలు, వీడియోలు ఆమె షేర్ చేస్తున్నారు.
ఆకర్షించే లుక్ ఆమె సొంతం. వివరాలు తెలిశాక… ఆమెకు రామ్ గోపాల్ వర్మ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. నీకు ఇష్టం ఉంటే… హీరోయిన్ ఆఫర్ ఇస్తాను అన్నాడు. అందుకు శ్రీలక్ష్మి సతీష్ అంగీకరించారు. నేడు ఆమెతో కొత్త మూవీ ప్రకటన చేశారు. శారీ గర్ల్ గా ఫేమస్ అయిన శ్రీలక్ష్మి సతీష్ సినిమా పేరు వర్మ శారీ గా నిర్ణయించాడు.
నేడు ప్రకటించడం వెనుక బలమైన కారణం కూడా ఉంది. డిసెంబర్ 21 ఇంటర్నేషనల్ శారీ డే. ఈ సందర్భంగా శారీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇక శారీ ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అని సమాచారం. శ్రీలక్ష్మి సతీష్ లుక్ బాగుంది. ఈ ప్రాజెక్టు కి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం వర్మ వ్యూహం మూవీ విడుదల పనుల్లో ఉన్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది.