Ram Gopal Varma- Liger: కంటెంట్ పక్కన పెడితే లైగర్ డిజాస్టర్ కావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒకరని అంటున్నారు. కరణ్ జోహార్ పై ఉన్న వ్యతిరేకత వలనే బాలీవుడ్ ప్రేక్షకులు లైగర్ ని పక్కన పెట్టేశారనే టాక్ నడుస్తుంది. యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మరణం తర్వాత కరణ్ జోహార్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే విషయాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మానసిక వేదనకు కరణ్ జోహార్ తో పాటు పలువురు స్టార్స్, నెపో కిడ్స్ కారణమయ్యారని నెటిజెన్స్ నమ్మారు.

ఈ క్రమంలో కరణ్ జోహార్, కరీనా కపూర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో టార్గెట్ గా మారారు. 2020లో వీళ్ళ మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే… కరణ్, అలియా, కరీనా నెలల తరబడి ముఖం చాటేశారు. సోషల్ మీడియాకు పూర్తిగా దూరం అయ్యారు. మహేష్ భట్ దర్శకత్వంలో అలియా నటించిన సడక్ 2 చిత్రాన్ని ప్రేక్షకులు డిజాస్టర్ చేశారు. ఓటీటీలో విడుదలైన ఆ చిత్రాన్ని బాయ్ కాట్ చేశారు.
Also Read: Liberation Day or Integration Day: విమోచన.. సమైక్యత సందిగ్ధం.. నడుమ స్వాతంత్య్రం.. పోటాపోటీ వేడుకల్లో మైలేజ్ ఎవరికో..?
సుశాంత్ మరణించి రెండేళ్లు దాటిపోయినా ఆ ఆగ్రహ జ్వాలలు ఆరడం లేదు. కరణ్ జోహార్ నిర్మించిన ప్రతి సినిమాను బాయ్ కాట్ చేయాలని నెగిటివ్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ రిలీజ్ బ్రహ్మాస్త్ర ఇదే వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో లైగర్ డిజాస్టర్ వెనుక కరణ్ జోహార్ ఉన్నాడని వర్మ తెలియజేశాడు. లైగర్ చిత్రానికి కరణ్ సహ నిర్మాతగా ఉన్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు లైగర్ ని అవైడ్ చేశారన్నారు. సుశాంత్ మరణం తర్వాత కరణ్ జోహార్ చిత్రాలను బహిష్కరించడం సర్వసాధారమైపోయిందని వర్మ అభిప్రాయ పడ్డారు.

ఇక విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ మరొక కారణం అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ చాలా వినయంగా ఉంటారు. వాళ్ళ ప్రవర్తనకు బాలీవుడ్ ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. విజయ్ దేవరకొండ మాత్రం వేదికలపై దూకుడుగా ఉంటాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ విజయ్ దేవరకొండ మాటతీరు, కామెంట్స్ వాళ్లకు నచ్చకపోయి ఉండవచ్చని వర్మ తెలియజేశారు. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న వర్మ లైగర్ ఫెయిల్యూర్ పై ఈ విధంగా స్పందించారు.