Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: వర్మ చేతికి చిక్కిన శారీ గర్ల్ ఎలా తయారైందో చూడండి... ఆ...

Ram Gopal Varma: వర్మ చేతికి చిక్కిన శారీ గర్ల్ ఎలా తయారైందో చూడండి… ఆ వీడియో చూస్తే నిద్ర కూడా పట్టదు!

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ప్రత్యేకమే. ఒకప్పుడు కల్ట్ క్లాసిక్స్ తెరకెక్కించిన వర్మ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. కొన్నేళ్లుగా ఆయన కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ఆధారంగా లోబడ్జెట్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. వర్మ చిత్రాల్లో విషయం ఉండదని జనాలు ఫిక్స్ అయ్యారు. అయినప్పటికీ ఏదో విధంగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడం, వర్మకు వెన్నతో పెట్టిన విద్య.

వర్మ శారీ టైటిల్ తో ఒక చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేరళ భామను ఎంపిక చేశాడు. ఇది ఆమెకు డెబ్యూ మూవీ . ఆమె పేరు ఆరాధ్య దేవి. ఈమె అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్. ఇంస్టాగ్రామ్ లో శ్రీలక్ష్మి సతీష్ ని చూసిన వర్మ ఫిదా అయ్యాడు. చీర కట్టులో ఆమె సహజ అందాలకు ముగ్ధుడయ్యాడు. ఆమె ఎవరో వివరాలు తెలియజేయాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చాడు. అనంతరం ఆమెతో నేరుగా మాట్లాడి, హీరోయిన్ రోల్ ఆఫర్ చేశాడు.

శ్రీలక్ష్మి సతీష్ పేరును కాస్తా ఆరాధ్య దేవిగా మార్చాడు. ఇక శారీ మూవీ డిటైల్స్ పరిశీలిస్తే… ఇదో సైకలాజికల్ థ్రిల్లర్. చీరకట్టులో ఓ అమ్మాయిని చూసి ఆమె మాయలో పడిపోతాడు ఒక యువకుడు. ఆమె కోసం సైకోలా తయారవుతాడు. మితిమీరిన ప్రేమ ఎంతటి అనర్థాలకు దారి తీస్తుందో శారీ మూవీలో తెలియజేయనున్నారు. శారీ చిత్రానికి వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

గిరి కృష్ణ కమల్ దర్శకుడు. ఆరాధ్య దేవి, సత్య యాడు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. మరొక విశేషం ఏమిటంటే… ఈ చిత్రంలో పాటలను AI సహాయంతో కంపోజ్ చేయిస్తున్నారట. తక్కువ బడ్జెట్ తో మూవీ పూర్తి చేసి ఎక్కువ లాభాలు ఆర్జించడమే వర్మ లక్ష్యం. శారీ గర్ల్ గా పేరుగాంచిన సోషల్ మీడియా బ్యూటీని శారీ చిత్రంతో హాట్ బ్యూటీ గా మార్చేశాడు వర్మ.

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)

RELATED ARTICLES

Most Popular