మొత్తానికి రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద కామెంట్స్ ను అలాగే కంటిన్యూ చేస్తూ.. తాజాగా ఓ విషయం పై స్పందించాడు. అది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. వర్మ మాటల్లో.. ‘రెండేళ్ల క్రితం బాలీవుడ్ అలాగే సౌత్ ఇండస్ట్రీలోని ఇతర ఇండస్ట్రీలు కూడా కన్నడ సినిమా ఇండస్ట్రీ వైపు కనీసం కన్నేత్తి కూడా చూసేవారు కాదు. అయితే, ఇప్పుడు కెజిఎఫ్ అనే సినిమా కన్నడ ఇండస్ట్రీని వరల్డ్ మ్యాప్ లో పెట్టేసింది.. అంటూ ఆ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను ప్రశంసిస్తూ.. మొత్తానికి అతనికి దండం ఎమోజీ కూడా పెడుతూ వర్మ ట్వీట్ చేశాడు.
Also Read: ఈ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగే !
అలాగే మరో ట్వీట్ లో ‘బాహుబలి 2 ట్రైలర్ మూడేళ్ళలో కేవలం 11కోట్ల వ్యూవ్స్ ను అందుకుందని, ఇక ఆర్ఆర్ఆర్ మూడు నెలలు సమయంలో 3.8కోట్ల వ్యూవ్స్ ను అనుకుందని అన్నారు. కానీ కేజీఎఫ్ 2 టీజర్ మాత్రం మూడు రోజుల్లోనే 14కోట్ల వ్యూవ్స్ ను అందుకున్నట్లు వర్మ తన శైలిలో కామెంట్స్ చేశాడు. ఒక విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్టమక్ పంచ్ ఇచ్చాడని అన్నాడు వర్మ. మొత్తానికి కేజిఎఫ్ ను ఆకాశానికి ఎత్తివేస్తూ చేసిన ఈ ట్వీట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.
Also Read: స్టార్ హీరోలూ.. యూఎస్ కలెక్షన్స్ నిల్ !
ఇక పనిలో పనిగా వర్మ క్రాక్ సినిమాపై కూడా ఓ పాజిటివ్ కామెంట్ పడేశాడు. జనాలు మళ్ళీ సినిమా థియేటర్లకు వచ్చేలా చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి కంగ్రాట్స్ చెప్పుకొచ్చాడు. మరి ఈ కామెంట్ లో ఎంత నిజం ఉందో వర్మకే తెలియాలి. ఏ మిడ్ నైట్ పార్టీలో క్రాక్ టీమ్ ను వర్మ కలిసి ఉంటాడు, వాళ్ళు ఇచ్చిన పార్టీకి ఫలితంగా ఇలా ఒక ట్వీట్ పెట్టాడు అంటూ మొత్తానికి వర్మ పై నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. అన్నట్టు వర్మ పోస్ట్ ల్లో ‘రవితేజ కెరీర్ లోనే క్రాక్ బిగ్గెస్ట్ మూవీ అని కూడా పెట్టాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్