Rangasthalam On Japan: జపాన్ లో రామ్ చరణ్ ‘రంగస్థలం’ ప్రభంజనం..కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా!

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది,వచ్చే ఏడాది లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కెరీర్ లో #RRR , గేమ్ చేంజర్ లాంటి సినిమాలు భవిష్యత్తులో ఎన్నో రావొచ్చు రాకపోవచ్చు. కానీ 'రంగ స్థలం' లాంటి క్లాసిక్ చిత్రం రావడం మాత్రం అంత సులువైన విషయం కాదనే చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ నటన ని మనం ఎప్పటికీ మరచిపోలేము.

Written By: Vicky, Updated On : July 13, 2023 3:51 pm

Rangasthalam On Japan

Follow us on

Rangasthalam On Japan: #RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఖండాలను దాటి పాన్ వరల్డ్ రేంజ్ కి ఎగబాకిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక నుండి రామ్ చరణ్ నుండి రాబొయ్యే సినిమాలు అదే రేంజ్ స్కేల్ లో తెరకెక్కబోతున్నాయి. ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది,వచ్చే ఏడాది లో ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ కెరీర్ లో #RRR , గేమ్ చేంజర్ లాంటి సినిమాలు భవిష్యత్తులో ఎన్నో రావొచ్చు రాకపోవచ్చు. కానీ ‘రంగ స్థలం’ లాంటి క్లాసిక్ చిత్రం రావడం మాత్రం అంత సులువైన విషయం కాదనే చెప్పాలి. ఇందులో రామ్ చరణ్ నటన ని మనం ఎప్పటికీ మరచిపోలేము.

అయితే ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజ్ లో అన్నీ భాషల్లోకి దబ్ చేసి విడుదల చేయాల్సిందిగా అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. కానీ మేకర్స్ మాత్రం ఇన్ని రోజులు పట్టించుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమాని జపాన్ భాషలోకి దబ్ చేసి జులై 14 వ తారీఖున, అంటే రేపే గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాతో పాటుగా KGF సిరీస్ కూడా విడుదల కాబోతుంది. అయితే రంగస్థలం కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఎవ్వరి ఊహకు అందని విధంగా జరిగింది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ చిత్రానికి రెండు మిలియన్ జపనీస్ డాలర్లు వచ్చాయట.

ఇక సినిమా విడుదలైన తర్వాత ఇంకా ఎక్కువ వసూళ్లు మొదటి రోజు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరో పక్క KGF సిరీస్ రెండు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ని కలిపినా కూడా ‘రంగస్థలం’ అడ్వాన్స్ బుకింగ్స్ కంటే తక్కువగా ఉన్నాయి. దీనిని బట్టి జపాన్ లో రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా జపాన్ లో ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.