Satya Yugam : ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎలాంటి పాత్రకి అయినా సరితూగే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రామ్ చరణ్(Ram Charan) మాత్రమే. ఇతనితో మాస్, క్లాస్, ఫ్యామిలీ సబ్జక్ట్స్ తో పాటు పీరియాడికల్, మైథాలజీ జానర్ సినిమాలను కూడా తెరకెక్కించొచ్చు. అంతే కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ లో అయితే రామ్ చరణ్ నటించడు, జీవిస్తాడు అనొచ్చు. రీసెంట్ గా విడుదలైన ‘గేమ్ చేంజర్(Game Changer)’ చిత్రం కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ, రామ్ చరణ్ నటనకు మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన కష్టాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయారు అనే వాదన కూడా వినిపించింది. అయితే ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ లోని అద్భుతమైన నటనను మరోసారి బయటపెట్టే క్యారక్టర్ ఇది. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు తెరమీదకు ‘కిల్(Kill Movie)’ మూవీ డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్(Nikhil Nagesh Bhat) వచ్చాడు. బుచ్చి బాబు తో సినిమా పూర్తి అవ్వగానే ఆయన చేయబోయే ప్రాజెక్ట్ ఇదేనని తెలుస్తుంది. ఈ చిత్రం మైథలాజి జానర్ లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ అని నిఖిల్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. మన పురాణాల ప్రకారం ఈ భూమిని సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం గా విభజించిన విషయం తెలిసిందే. ద్వాపర యుగం శ్రీ కృష్ణ అవతారానికి సంబంధించినది కాగా, త్రేతా యుగం శ్రీరాముడి అవతారానికి సంబంధించినది. ఇక కలి యుగం శ్రీ మహావిష్ణువు చివరి అవతారం ‘కల్కి’ కి సంబంధించిన యుగం అనే విషయం తెలిసిందే. వీటి మీద ఇన్ని దశాబ్దాల కాలం లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ సత్య యుగానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు రాలేదు.
అందుకే నిఖిల్ నగేష్ ఆ జానర్ పై ఫోకస్ పెట్టాడు. ఆ కాలం లో మనుషులు ఎలా ఉండేవారు, అప్పట్లో నీతి, న్యాయం, ధర్మం వంటివి ఎలా ఉండేవి, ఆ కాలం లో అన్యాయాన్ని అరికట్టడానికి శ్రీ మహావిష్ణువు ఎలాంటి అవతారం ఎత్తాడు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్ ని వినిపించాడట. రీసెంట్ గానే నిఖిల్ రామ్ చరణ్ ని కలిసి ఈ స్టోరీ వివరించగా, రామ్ చరణ్ ఎంతో ఇష్టపడ్డాడని తెలుస్తుంది. సుకుమార్ మూవీ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నందున ముందుగా ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడట రామ్ చరణ్. కేవలం ఆరు నెలల సమయంలోనే మూవీ షూటింగ్ పూర్తి అవుతుందట. అంతటి పకడ్బందీ ప్లాన్ తో ఉన్నాడు డైరెక్టర్. ఈ సినిమాని కరెక్ట్ గా తీస్తే బాక్స్ ఆఫీస్ వద్ద 2000 కోట్లు రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.