Ram Charan Upasana Konidela: తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు రాంచరణ్. చిరంజీవి వారసుడిగా రంగ ప్రవేశం చేసి అనతికాలంలోనే అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తండ్రికి తగ్గ తనయుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. నటనలో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవల ఆయన తన తండ్రితో కలిసి ఆచార్య లో నటించి తన కల నెరవేర్చుకున్నారు. తండ్రితో కలిసి నటించాలనే చిరకాల వాంఛను తీర్చుకున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు. రాంచరణ్ తనదైన నటనతో అభిమానులను మెప్పిస్తున్నాడు. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మైరమరపింపచేస్తున్నారు. డ్యాన్సులతో అదరగొడుతూ తండ్రిని మించిన తనయుడు అనే పేరు తెచ్చుకుంటున్నారు.

రాంచరణ్ వివాహం జరిగి పదేళ్లవుతోంది. 2012లో వారి పెళ్లి తంతు ముగిసింది. తన తోటి హీరోలందరికి ఇద్దరు పిల్లలుండగా రాంచరణ్ కు మాత్రం ఇంతవరకు సంతానం లేదు. దీంతో అభిమానులు కంగారు పడుతున్నారు. మాకు బుల్లి చిరంజీవి ఎప్పుడొస్తారని ఆశ పడుతున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి తీపికబురు వారి నుంచి అందడం లేదు దీంతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ అభిమాన హీరో తండ్రి కావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాంచరణ్, ఉపాసన జంట ఇటలీలో తమ వివాహ వేడుకను జరుపుకున్నారు.
Also Read: IPL Media Rights: ఐపీఎల్ టీవీ ప్రసార హక్కులు రూ.23575 కోట్లు, డిజిటల్ ప్రసార హక్కులు రూ.23758 కోట్లు
రాంచరణ్ కు పిల్లలు లేకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. ఉపాసనకు గర్భం ధరించడమంటే భయంగా ఉందట. పైగా అపోలో లైఫ్ విభాగానికి వైఎస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వహిస్తోంది. ఉపాసన ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత గర్భం దాల్చడమనేది నా పర్సనల్ విషయం. మాకు ఇప్పట్లో పిల్లలు వద్దని అనుకున్నాం. మరోవైపు గర్భం విషయంలో నాకు కొన్ని భయాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే బరువు తగ్గుతున్నాను.. పిల్లలు ఎప్పుడు కనాలనే విషయంలో మాకు ప్లానింగ్ ఉంది’ అని ఉపాసన తన అంతరంగికాన్ని బయటపెట్టింది. అందుకే ఇన్నాళ్లు పిల్లల కోసం ప్లాన్ చేయలేదని తెలుస్తోంది. మరీ అప్పుడే పిల్లలంటే కెరీర్ కూడా దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఇన్నాళ్లు ఆగినట్లు తెలుస్తోంది.
పైగా రాంచరణ్ కు కూడా కొన్ని లక్ష్యాలు ఉన్నాయట. పిల్లలైతే తమ భవిష్యత్ ఆగిపోతుందనే ఉద్దేశంతోనే వారు ఇంకా పిల్లలు వద్దనుకుంటున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి రాంచరణ్, ఉపాసన పిల్లల గురించి ఆలోచనలు చేయడం లేదని తెలుస్తోంది. అందుకే వారికి పిల్లలు పుట్టడం లేదనే విషయం అవగతమవుతోంది.

ప్రస్తుతం రాంచరణ్ తోటి హీరోలందరికీ పిల్లలు పుట్టారు. మీకే ఇంకా కలగలేదని చెబుతుంటే వారికి కూడా ఇబ్బందిగానే ఉంటోంది. కానీ త్వరలో పిల్లల గురించి ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మీదట పిల్లల కోసమే ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు వారి మాటల ద్వారా బోధపడుతోంది. త్వరలో బుల్లి చిరంజీవిని చూడొచ్చని అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. రాంచరణ్, ఉపాసన జంట అభిమానుల కోరిక తీరుస్తారా? మళ్లీ వాయిదా వేసి నిరాశపరుస్తారో వారే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Recommended Videos
[…] […]