Acharya Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు – చెర్రీ ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, సినీ ఇండస్ట్రి లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సోనూ సూద్ కీలక పాత్ర చేశారు. ఆల్రెడీ ‘లాహే… లాహే..’ పాటలో సీనియర్ హీరోయిన్ సంగీత కనిపించి మెప్పించారు. ఇంకా పలువురు కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది.
ఆచార్య మూవీ నుంచి రామ్ చరణ్ టీజర్ ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. టీజర్‌లో రామ్ చరణ్, పూజా హెగ్డే మధ్య ప్రేమను చూపించారు. అలాగే, ప్రేమతో పాటు చరణ్ ఫైట్ చేయడం చూపించారు. అలానే సిద్ధ మావోయిస్టుగా మారినట్టు చూపించారు. ధర్మస్థలికి ఆపద వస్తే ఆ అమ్మోరుతల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. ఇక చివరిలో చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటే వెనుక చిరుత ఉన్న విజువల్ చూపించారు అచ్చం అలాగే చరణ్ నీళ్లు తాగుతుంటే… చరణ్ వెనుక చిరంజీవి రావడం హైలైట్ అని చెప్పొచ్చు. ఒక్క టీజర్‌లోనే చాలా విషయాలు పొందుపరిచారు దర్శకుడు కొరటాల శివ. ఇక ఆచార్య సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సినిమా విడుదల కోసం ఇటు మెగా అభిమానులే కాకుండా యావత్ సినీ ఇండస్ట్రీ సైతం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
#SiddhasSaga Teaser out now 🔥
Feel the Goosebumps!
▶️ https://t.co/iWTGhr9dRl#Acharya #AcharyaOnFeb4th
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/UaEmDKmqUK
— Konidela Pro Company (@KonidelaPro) November 28, 2021