Ramcharan, Shankar : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథనాయకుడిగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘గేమ్ చేంజర్’ పై అభిమానుల్లో భారీ ఆశలు పెట్టుకున్నారు. డైరెక్టర్ శంకర్ తన సినీ కెరియర్ లో స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే కావడం ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అంతేకాదు పాన్ ఇండియా రేంజ్ లో సినిమా రెడీ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని టాక్. రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని ఇప్పటికే రైటర్ కార్తీక్ సుబ్బరాజు వెల్లడించారు. అయిత ఈ సినిమా ఎప్పుడూ రిలీజ్ అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు. అయితే తాజాగా యానిమల్ మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజ్ గేమ్ చేంజర్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు.
పదిహేను రోజులుగా గేమ్ చేంజర్ సినిమా చిత్రీకరణ మైసూర్ లో జరుగుతుందని దిల్ రాజు తెలిపారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి అయిందన్నారు. మేకింగ్, పెర్పెక్షన్ కోసం దర్శకులు ఈ విధంగా సమయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే వారిని మనం కంగారు పెట్టకూడదని చెప్పారు. అలాగే సినిమా షూటింగ్ తరువాత మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందన్న దిల్ రాజు దానికి పట్టే సమయాన్ని బట్టి రిలీజ్ డేట్ డిసైడ్ చేస్తామని తెలిపారు.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు మరింత సమయం వేచి చూడాలని దిల్ రాజు కోరారు. బెస్ట్ అవుట్ పుట్ తో ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.