
Ram Charan: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ రేంజ్ మారిపోయింది. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. గొప్ప నటుడిగా రామ్ చరణ్ ని ప్రపంచం గుర్తించింది. ఆయనకు దక్కుతున్న గౌరవాలే అందుకు నిదర్శనం. ప్రఖ్యాత గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొనే అవకాశం రామ్ చరణ్ కి దక్కింది. ఈ గౌరవం అందుకున్న మొదటి ఇండియన్ హీరో రామ్ చరణ్ కావడం విశేషం. తన మాటలతో అమెరికన్ ఆడియన్స్ మనసులు దోచేశారు. స్థానికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. తాజాగా మరో ఘనత ఆయనకు దక్కింది. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు గెస్ట్ గా రామ్ చరణ్ హాజరయ్యారు.
ఆయన చేతుల మీదుగా బెస్ట్ వాయిస్ ఫర్ మోటివేషన్ కాప్చర్ అవార్డు విజేతకు అందించారు. అలాగే అసోసియేషన్ ఆయన్ని ఓ అవార్డుకి ఎంపిక చేసింది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆయనకు దక్కిన గుర్తింపుకు గాను ‘స్పాట్ లైట్’ అవార్డు అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుతో రామ్ చరణ్ కెమెరాలకు ఫోజిచ్చారు. అంతర్జాతీయ సినిమా ఈవెంట్ లో రామ్ చరణ్ టక్సేడో సూట్ లో అదిరిపోయారు. రామ్ చరణ్ అచీవ్మెంట్ గురించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రత్యేకంగా చెప్పుకుంటుంది. కాగా బెస్ట్ యాక్షన్ మూవీ విభాగంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకుంది. ఇదో ఘనత అని చెప్పవచ్చు.
అలాగే క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ కి రామ్ చరణ్-ఎన్టీఆర్ నామినేట్ అయ్యారు. బెస్ట్ యాక్షన్ హీరోస్ కేటగిరీలో ఆర్ ఆర్ ఆర్ మూవీకి గాను ఎన్టీఆర్, రామ్ చరణ్ నామినేట్ కావడం జరిగింది. టామ్ క్రూజ్, బ్రాడ్ ఫిట్, నికోలస్ కేజ్ ఈ నామినేషన్స్ లో ఉన్న మిగతా హీరోలు. ఈ క్రమంలో రామ్ చరణ్ స్పందించారు. అంత పెద్ద హాలీవుడ్ స్టార్స్ పక్కన బ్రదర్ ఎన్టీఆర్, నా పేరు చూసుకోవడం గొప్ప అనుభూతి అంటూ అభివర్ణించారు. క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ మార్చి 16న ప్రకటించనున్నారు. బెస్ట్ యాక్షన్ హీరో నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో ఒకరు అవార్డు గెలుచుకోనున్నారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీతో దర్శకుడు రాజమౌళి, నటులు చరణ్, ఎన్టీఆర్ సంచలనాలు చేస్తున్నారు. ఇక ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వేదికపైకి వెళ్లి గోల్డెన్ గ్లోబ్ అందుకున్నారు. ఇక ఆస్కార్ నామినేషన్స్ కూడా సాధించిన నేపథ్యంలో మార్చి 12న ఫలితం తేలనుంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే ఆస్కార్ ఈవెంట్ రెండు వారాల్లో జరగనుంది. ఆస్కార్ కనుక గెలుచుకుంటే రాజమౌళి అండ్ టీమ్ ఇండియా తరఫున సాధించిన గొప్ప విజయం గా నిలిచిపోతుంది.
Stealing the spotlight, again!🥳
Our Global star@AlwaysRamCharan garu receives the #SpotlightAward for #RRR at the reputed @HCAcritics Awards.#RamCharan #SuperAwards#ManOfMassesRamCharan#RamCharanAtHCAFilmAwards pic.twitter.com/od8VAtQpsW
— SivaCherry (@sivacherry9) February 25, 2023