Ram Charan Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ఈనెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం ప్రముఖ నిర్మాత ఎస్ కే ఎన్ పెద్ది సినిమా ని పోస్ట్ పోన్ చేస్తున్నారు. జూన్ నెలలో ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది అంటూ కొన్ని కామెంట్స్ చేశాడు. మరి ఆ కామెంట్స్ మీద పెద్ది సినిమా యూనిట్ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. దాంతో ఏప్రిల్ 30వ తేదీన పెద్ది సినిమా రిలీజ్ అవుతుందా? లేదంటే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే విషయం తెలియక మెగా అభిమానులైతే కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నారట. జూన్ నెలలో కాకుండా మే సెకండ్ వీక్ లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా రామ్ చరణ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయన భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. గత సంవత్సరం గేమ్ చేంజర్ తో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్న ఆయన ఇప్పుడు ఈ సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తేనే ముందుకు దూసుకెళ్తాడు. లేకపోతే మాత్రం ఆయన చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…
ఇక ఈ సినిమా తర్వాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో మరొక వైవిద్య భరితమైన కథాంశంతో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కానీ ఇక మీదట చేయబోతున్న సినిమాలు అతనికి ఏ రేంజ్ సక్సెస్ ని కట్టబెడతాయి అనే విషయంలోనే సరైన క్లారిటి రావడం లేదు…