Peddi Movie Updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపు ఉంది. ఆయన తనయుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే మెగా పవర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి రెండోవ సినిమాతోనే అంత పెద్ద ఘనతను సాధించిన హీరోగా చరిత్రలో నిలిచాడు…ఇప్పటివరకు ఆయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకొని స్టార్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో ‘ పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి…ఇక ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలన్నీ ఒకేత్తైతే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది అంటూ బుచ్చిబాబు ఈ సినిమా మీద భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో 2000 మందితో ఒక భారీ ఫైట్ అయితే ఉండబోతుందట…
Also Read: భయపెడుతున్నారు..కానీ నన్ను థియేటర్ కి రాకుండా ఆపలేరు – విజయ్ దేవరకొండ
క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో ఈ ఫైట్ కీలకంగా మారబోతోంది అంటూ దర్శకుడు చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… పెద్ది సినిమా ఎంత ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది పర్ఫెక్ట్ గా చెప్పలేం కానీ మొత్తానికైతే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగి భారీ రికార్డులను కొల్లగొడుతుందని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఈ సినిమా హైయెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి… ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుతున్నారట. వచ్చే సంవత్సరం మార్చి 25వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…
Also Read: : ఓజీ ట్రైలర్ డేట్ ను లాక్ చేశారా..? రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్…
రామ్ చరణ్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఇండియాలో నెంబర్ వన్ రేసులో తను కూడా ఒకడిగా నిలుస్తాడు. లేకపోతే మాత్రం ఈ సినిమా అతనికి భారీగా మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి… చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ మార్కెట్ ను భారీగా పెంచుకుంటాడా లేదా అనేది…