Ram Charan: కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీ ని ఏలిన నటుడు చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు, ఆయన వేసిన పాత్రలే ఆయన్ని చాలా ప్రత్యేకంగా నిలిపాయి. అలాంటి చిరంజీవి తన వారసుడు అయిన రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేయడానికి చాలా కసరత్తులు చేశాడు… పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేత ‘చిరుత’ సినిమా చేయించాడు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య 2007 సెప్టెంబర్ 28వ తేదీన రిలీజై సూపర్ హిట్ అయింది..ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీ కి వచ్చి 18 సంవత్సరాలు పూర్తి అయింది…రామ్ చరణ్ మొదటి సినిమా తోనే సక్సెస్ ఫుల్ హీరోగా పేరు సంపాదించుకున్నప్పటికి నటనలో పరిణితిని మాత్రం చూపించలేకపోయాడు. దాంతో చరణ్ నటన మీద కొంతమంది కొన్ని విమర్శలను చేశారు. ఆ తర్వాత మగధీర సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించాడు. అయినప్పటికి నటన విషయంలో మాత్రం రామ్ చరణ్ ఇతర హీరోలతో పోటీ పడలేడు అంటూ కొన్ని విమర్శలైతే వచ్చేవి. ఇక ఆ తర్వాత ఆయన వరుసగా కమర్షియల్ సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించినప్పటికి చిరంజీవిలో ఉన్న నటన చరణ్ లో కనిపించడం లేదు. అదే మైనస్ అవుతుందని చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు… మెగాస్టార్ కొడుకు అంటే అతని మీద ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. అలాగే మెగా ఫ్యామిలీ అభిమానులు తన మీద ఎన్ని ఆశలు పెట్టుకొని అతని సినిమా కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అనే విషయాల మీద రియాల్టీ తో ఆలోచించిన రామ్ చరణ్ తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మనకు నచ్చేవి కాదు జనం మెచ్చే సినిమా చేయాలి అనుకోని తనను తాను ఒక కర్మయోగిలా మార్చుకున్నాడు. సక్సెస్ ఒకటే అల్టిమేట్ కాదు నటనలో కూడా పరిణితిని చూపించినప్పుడే గొప్ప నటుడు అవుతారు అని వాళ్ళ నాన్న చెప్పిన మాటకు కట్టుబడి ముందుకుసాగాడు…
ఇక అందులో భాగంగా వచ్చినవే ధృవ, రంగస్థలం సినిమాలు… సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం మూవీలో తన నటన నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. చిట్టిబాబు పాత్రను చరణ్ తప్ప మరొకరు చేయలేరు అనేంత గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలాంటి పాత్ర చేయాలంటే ఈ తరం హీరోల్లో ఒక్క రామ్ చరణ్ వల్లే అవుతోంది. అంటూ మొదట్లో తనను విమర్శించిన వాళ్ళ చేతే ప్రశంశల వర్షాన్ని కురిపించాడు…
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా మంచి సక్సెస్ లను సాధిస్తూ గ్లోబల్ స్టార్ గా అవతరించాడు… ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక రామ్ చరణ్ ఇండస్ట్రీ కి వచ్చి 18 సంవత్సరాలు అవుతుంది అంటూ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ‘పెద్ది’ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో రామ్ చరణ్ రైలు పట్టాల మీద నిల్చొని ఉన్నాడు.ఈ పోస్టర్ చాలా ఫ్రెష్ ఫీల్ తో ఉంది…ఇక ఈ సినిమా 2026 మార్చ్ 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది…
ఇక చరణ్ ఇప్పటివరకు టాప్ హీరోలందరికి పోటీని ఇస్తున్న ఆయన నెంబర్ వన్ పొజిషన్ ని అందుకొని మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఇక రామ్ చరణ్ సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే వ్యక్తిగతంగా కూడా చిరంజీవి లానే చాలామందికి సహాయ సహకారాలను అందిస్తుంటారు. ఇక ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. తను డీసెంట్ పర్సన్ కావడం వల్లే అతనంటే అందరికీ చాలా ఇష్టం ఉంటుంది…