Ram Charan Gold Coin: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అభిమానులు చరణ్ కి నీరాజనాలు పలుకుతూ పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ తన నటనతో అబ్బురపరిచాడు. ఎన్టీఆర్ తో పోటీ పడి నటించాడు. ఫలితంగా చరణ్ పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. చరణ్ లో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా ? అంటూ బాలీవుడ్ సైతం ఆశ్చర్యపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు చరణ్. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు.
Also Read: Karan Johar: సౌత్ సత్తాను క్యాష్ చేసుకుంటున్న కరణ్ జోహార్
వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు
రామ్ చరణ్ ‘చిరుత’తో హీరోగా మారాడు. కానీ, ‘మగధీర’తో భారీ విజయాన్ని అందుకుని స్టార్ అయ్యాడు. ఆ సినిమా ఇండస్ట్రీకే సూపర్ హిట్. అప్పట్లో కలెక్షన్లు కూడా రికార్డు స్థాయిలో వచ్చాయి. ఆ కలెక్షన్స్ చూసి ఫ్యాన్స్ మెగా పవర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. పైగా సినిమాకి సినిమాకి చరణ్ రేంజ్ కూడా అమాంతం పెరుగుతూ వచ్చింది. కాకపోతే.. రామ్ చరణ్ స్థాయి ‘రంగస్థలం’ తర్వాత మరో రేంజ్ కి వెళ్ళింది.

ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. పైగా ఆ చిత్రంతోనే చరణ్ పరిపూర్ణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ లో చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. ప్రస్తుతం చరణ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం కొరటాల – చిరు కలయికలో వస్తున్న ‘ఆచార్య’లోనూ రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు దిగ్గజ దర్శకుడు శంకర్ తోనూ ఓ సినిమా చేస్తున్నాడు.
Also Read:Bandi Sanjay: ‘డ్రగ్స్’ కేసులో ప్రమేయమున్న వారిని అరెస్ట్ చేసే దమ్ముందా?: బండి సంజయ్
[…] Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అంటే ఏంటో అనుకున్నాం గానీ.. ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే మొదటి నుంచి ఓటీటీ వేదికగా వస్తున్న ఈ షోలో.. అన్నీ ఊహించని పరిణామాలే జరుగుతున్నాయి. వాస్తవంగా జరగాల్సిన వాటికంటే భిన్నమైన ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్. […]