Ram Charan: నడిరోడ్డుపై రామ్ చరణ్ వీరంగం.. ట్రాఫిక్ పోలీస్ తో గొడవ

Ram Charan: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా లీకుల బెడద నుంచి మాత్రం తప్పించుకోలేక పోతుంది. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్‌ కు సంబంధించిన ఓ వీడియో లీకైంది.ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ లుక్ లీక్ అయి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు చరణ్ నడి రోడ్డు మీద చిందులు వేస్తున్న వీడియో కూడా లీక్ కావడంతో అది […]

Written By: Shiva, Updated On : May 11, 2022 4:30 pm
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా లీకుల బెడద నుంచి మాత్రం తప్పించుకోలేక పోతుంది. ప్రస్తుతం వైజాగ్ షెడ్యూల్‌ కు సంబంధించిన ఓ వీడియో లీకైంది.ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ లుక్ లీక్ అయి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు చరణ్ నడి రోడ్డు మీద చిందులు వేస్తున్న వీడియో కూడా లీక్ కావడంతో అది ఇంకా వైరల్ గా మారింది.

Ram Charan, Traffic Police

ఈ వీడియోలో చరణ్ నడి రోడ్డు మీద వీరంగం చేస్తూ కనిపించాడు. చరణ్ స్టెప్స్ చూస్తే.. ఇది సాంగ్ షూటింగ్‌లా అనిపిస్తోంది. అలాగే, చరణ్ ట్రాఫిక్ పోలీస్‌ తో కూడా గొడవ పడుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక గతంలో లీక్ అయిన పిక్ విషయానికి వస్తే… సాంప్రదాయ పంచె కట్టు, వైట్ అండ్ వైట్ లుక్‌లో హ్యాండ్ మడతెట్టి సైకిల్ తొక్కుతూ రామ్ చరణ్ కనిపించాడు.

Also Read: Asani Cyclone Impact: అసని తుఫాన్ ఎఫెక్ట్: ఏ దేశం నుంచో సముద్రంలో కొట్టుకు వచ్చిన బంగరు రథం.. వైరల్

ఏది ఏమైనా చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. మరో డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ చెప్పిన పొలిటికల్ కథ డైరెక్టర్ శంకర్‌కు నచ్చింది. అందుకే, కార్తిక్ సుబ్బరాజ్ కథనే సినిమాగా చేస్తున్నారు శంకర్. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. రాజకీయ డ్రామా అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది.

నిజానికి ఈ సినిమా మొదట ఫ్యామిలీ డ్రామా అన్నారు. కానీ.. ఇది కూడా పొలిటికల్ డ్రామా అని తెలిసే సరికి ఫ్యాన్స్ కి సినిమా పై ఆసక్తి మరింత రెట్టింపు అయింది. కారణం.. పొలిటికల్ డ్రామాలను శంకర్ అద్భుతంగా తీస్తాడు. ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Ram Charan – Shankar

ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. ఎలాగూ ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు. అన్నిటికీ మించి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కిస్తాడు. అందుకే ఈ భారీ పాన్ ఇండియా పొలిటికల్ సినిమా పై అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పని చేస్తున్నాడు.

Also Read:Anil Ravipudi Balayya : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కథ ఇదే.. కామెడీ కేకలా ఉంటుందట..!

 

Recommend Videos


Tags