RRR Movie: టాలీవుడ్ లో ఇద్దరు టాప్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తే ఆడియన్స్ కి థియేటర్స్ లో కన్నుల పండుగగా ఉంటుంది. అయితే ఇటు నందమూరి కుర్రోడు అటు మెగా బుల్లోడు నటిస్తే ఇంక ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఆ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అని అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా ” ఆర్ ఆర్ ఆర్”. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి నాటు నాటు పాట లిరికల్ ప్రోమో ను చిత్రా బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

కాగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఈ సాంగ్ కు సంబంధించి ఉన్న స్టైలిష్ లుక్ లో ఉన్న పిక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. మామూలు గానే చరణ్ , ఎన్టీఆర్ డాన్స్ ఇరగదీస్తారు. ఇక ఈ మూవీ లో వీరిద్దరు కలిసి మాస్ సాంగ్ కి స్టెప్పులేస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులు ఎదురుకుస్తున్నారు. కాగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఈ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఆలియా భట్, హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ హీరోయిన్లు గా నటించారు. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
A delightful snap of our Mass Ka Masters Chilling in between the song shoot !! 🤩💥⚡️#RRRMassAnthem from 4 PM today. 🤩💥🕺🕺#NaatuNaatu #NaattuKoothu #NaachoNaacho #HalliNaatu #Karinthol #RRRMovie@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @OliviaMorris891 @DVVMovies @RRRMovie pic.twitter.com/f8hSdkVgsh
— RRR Movie (@RRRMovie) November 10, 2021