హీరోయిన్ ‘రకుల్ ప్రీత్ సింగ్’ కొత్తగా ఒప్పుకున్న సినిమా ఒకటి అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. కండోమ్ కంపెనీ ఎక్స్ క్యూటివ్ గా ఆమె కనిపించబోతుంది. కార్పొరేట్ కంపెనీల్లో ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో ఒక అవగాహన ఉంటుంది. మరి కండోమ్ కంపెనీల్లో పనిచేసే లేడీ ఎక్స్ క్యూటివ్ వర్క్ ఎలా ఉంటుందో మరి. అసలు వాళ్ళను ‘సెక్స్’క్యూటివ్ అని సరదాగా అనుకోవచ్చు ఏమో.
ఇంతకీ రకుల్ పని ఏమిటంటే.. కండోమ్ కంపెనీల్లో టెస్టింగ్ అంటే కండోమ్స్ నాణ్యతని పరిశీలించి చెప్పే పని అన్నమాట. అసలు ఇలాంటి పనిని అమ్మాయిలు చేస్తారా? అంటే.. సినిమా కాబట్టి ఏమైనా చేస్తారు. సో.. రకుల్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఎలాగూ కామెడీ సినిమా కాబట్టి మసాలా అంశాలు మస్తుగా దట్టిస్తారు. పైగా ఆ టైపు క్యారెక్టర్స్ ను పోషించడంలో రకుల్ ఆరితేరిపోయింది.
ఇంతకీ ఈ ఆణిముత్యాన్ని ప్రముఖ నిర్మాత రాని స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని రకుల్ ఒప్పుకోవడానికి ఒక కారణం ఉంది. హిందీలో వెరైటీ కాన్సెప్ట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన హీరో ఆయుష్మాన్ ఖురానా ఈ సినిమాలో హీరో. కాబట్టే.. రకుల్ కండోమ్ కంపెనీ ‘సెక్స్’క్యూటివ్ నటించడానికి వెంటనే ఒప్పేసుకుంది. ఏది ఏమైనా రకుల్ పక్కా బిజినెస్ విమెన్.
హీరోలను పట్టుకోవడంలో రకుల్ మాస్టర్ డిగ్రీ చేసింది. ఏది ఏమైనా పెద్దగా అందం అభినయం లేకపోయినా.. విపరీతమైన బోల్డ్ నెస్ తో ఎప్పటికప్పుడు మంచి కిక్ ఇస్తూ మొత్తానికి ఆ రకంగా రకుల్ ముందుకు పోతుంది. ఇక బాలీవుడ్ లో కూడా బిజీ అవ్వాలని, ఎప్పటినుండో తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అక్కడి ఒక స్టార్ హీరో ఆమెకు వరుసగా ఆఫర్లు కూడా ఇప్పించాడు. అయినా రకుల్ అక్కడ బి గ్రేడ్ హీరోయిన్ గానే మిగిలిపోయింది. మరి ఈ కండోమ్ సినిమాతోనైనా స్టార్ అవుతుందేమో చూడాలి.