
తెలుగులో సీక్వెల్ సినిమాలకు కొదవ లేదు. చాలా వరకు సినిమాలు సీక్వెల్ వచ్చినా విజయవంతం కాలేదు. ఒక్క బాహుబలి -2 తప్ప అన్ని సినిమాలు అపజయాన్నే మూటగట్టుకున్నాయి. ఈ కోవలో సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ -2, 2.0, ఆర్య-2, రాజుగారి గది తదితర సినిమాలు వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సీక్వెల్ లపై పట్టించుకోవడం లేదు. అయితే గతంలో తమళ మాతృకలో వచ్చిన రాక్షసన్ ను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేశారు. అది విజయవంతమైంది. దీంతో దర్శకుడు రమేశ్ వర్మకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
తమిళంలో విజయవంతమైన రాక్షసన్ సినిమాను రీమేక్ గా తెలుగులో నిర్మించారు. దీనికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించారు. దర్శకుడు రమేశ్ వర్మకు మంచి పేరు రావడంతో ఆయనకు రవితేజతో సినిమా చేసే అవకాశం దొరికింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఖిలాడీ అనే సినిమా రాబోతోంది. ఈలోగా రాక్షసుడు-2కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. తమిళంలో రాక్షసన్ కి సీక్వెల్ రాకపోయినా తెలుగులో మాత్రం కథ తయారయింది.
హీరో ఎవరనే దానిపైనే ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలు ఉండడంతో ఆయన నటించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే హీరో ఎవరిని పెడితే బాగుంటుందనే విషయంపైనే దర్శకుడు దృష్టి పెట్టినట్లు సమాచారం. శ్రీనివాస్ చేతిలో హిందీ రీమేక్ ఛత్రపతి, పెన్ స్టూడియోస్ తో మరో సినిమా ఉంది.
ఇవి పూర్తి కావడానికి సమయం పడుతుందనే కారణంతో ఆయన నటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దర్శకుడు రమేశ్ వర్మ మాత్రం హీరోను వెతుక్కునే పనిలో పడ్డారు. కమెడియన్ నుంచి హీరోగా టర్న్ అయిన నటుడితో ఈ సినిమా తెరకెక్కించే అవకాశాలు ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. మొత్తానికి రాక్షసుడు-2 పైన కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రాక్షసుడు సృష్టించిన సంచలనం రాక్షసుడు -2 కూడా అందుకుంటుందని భావిస్తున్నారు.