Rakasa Movie 2 Day Box Office: విడుదలకు ముందు యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చిత్రాలకు , ఓపెనింగ్స్ కచ్చితంగా బాగుంటాయి అని చెప్పడానికి నిదర్శనంగా నిల్చింది రీసెంట్ గా విడుదలైన ‘రాకాస'(Rakasa Movie) చిత్రం . మొదటి రోజు దాదాపుగా 6 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం , రెండవ రోజు కూడా డీసెంట్ హోల్డ్ ని సాధించింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదట రోజున 2.51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో తెలుగు రాష్ట్రాల నుండే 1 కోటి 76 లక్షల రూపాయిలు ఉంది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఓవర్సీస్ నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెండవ రోజు వచ్చిన వసూళ్లను ఒకసారి బాగా పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 1 కోటి 60 లక్షల రూపాయిల వరకు వచ్చిందట. ఇక కర్ణాటక లో మొదటి రోజు కంటే ఎక్కువగా 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అవ్వగా, ఓవర్సీస్ నుండి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండవ రోజున 2 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. రెండు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటికే కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను దాటింది. క్లోజింగ్ లో ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని దాటుతుందా అని అంటున్నారు నెటిజెన్స్.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి ఓవర్సీస్ లో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ‘రాకాస’ చిత్రానికి అంత షేర్ వచ్చే అవకాశం లేదని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న మాట. ‘రాకాస’ ఓవర్సీస్ క్లోజింగ్ షేర్ వసూళ్లు 2 కోట్ల కంటే తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియా లో ట్రోల్స్ కోసం ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ని దాటేస్తుందని కొందరు అంటున్నారు కానీ , అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ‘రాకాస’ చిత్రానికి మూడవ రోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షో ట్రెండింగ్ గంటకు 3 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ చిత్రం రేపటి నుండి కచ్చితంగా మంచి హోల్డ్ ని కనబర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.