https://oktelugu.com/

Rajinikanth: అక్కినేని అఖిల్ తర్వాత అలాంటి చెత్త రికార్డు రజినీకాంత్ సొంతం అయ్యింది..ఇది మామూలు అవమానం కాదు!

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. విష్ణు విశాల్ హీరో గా నటించిన ఈ సినిమాకి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించగా, రజినీ ఒక ప్రత్యేక పాత్ర పోషించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 29, 2024 / 08:15 PM IST

    Rajinikanth

    Follow us on

    Rajinikanth: రికార్డులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిల్చిన సూపర్ స్టార్స్ లో ఒకరు రజినీకాంత్. 7 పదుల వయస్సు దాటినా కూడా, ఇప్పటికీ కుర్ర హీరోలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ, రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నాడు. ఈ వయస్సులో ఇలాంటి స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక సూపర్ స్టార్ ఒక్క రజినీకాంత్ మాత్రమే. వచ్చే ఏడాది తో 70 వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న చిరంజీవి కూడా ఇదే క్యాటగిరీలోకి వస్తాడు. ఇలా ఇండియా లో ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మాత్రమే రికార్డ్స్ తో ఆడుకుంటున్నారు. అయితే రజినీకాంత్ కి ఈ ఏడాది ‘లాల్ సలాం’ లాంటి ఘోరమైన డిజాస్టర్ పడింది. ఇంత ఎంత పెద్ద డిజాస్టర్ అంటే, ఈ ఏడాది పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, విజయ్ వంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తే వాటికి వచ్చినంత గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు, ఆ స్థాయి డిజాస్టర్ అన్నమాట.

    ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 18 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదట. విష్ణు విశాల్ హీరో గా నటించిన ఈ సినిమాకి రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించగా, రజినీ ఒక ప్రత్యేక పాత్ర పోషించాడు. అంటే మన తెలుగు లో పవన్ కళ్యాణ్ ‘గోపాల గోపాల’, ‘[బ్రో ది అవతార్’ చిత్రాల్లో ఎలా అయితే ప్రధాన పాత్రలు పోషించాడో, అలా అన్నమాట. ఇది కాసేపు పక్కన పెడితే వసూళ్ల పరంగా ఎలాగో లాల్ సలాం చిత్రం రజినీకాంత్ పరువు తీసే రేంజ్ లో నిల్చింది, కనీసం సాటిలైట్, డిజిటల్ రైట్స్ అయినా డీసెంట్ స్థాయి రేట్లకు అమ్ముడుపోతుందని ట్రేడ్ ఆశించింది. కానీ అది కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ఒక్క ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదట.

    రజినీకాంత్ సినిమా అంటేనే విడుదలకు ముందు వందల కోట్ల రూపాయిల టేబుల్ ప్రాఫిట్ వస్తుంది. అన్ని రకాల రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. కానీ ఈ సినిమాకి అసలు హైప్ లేకపోవడంతో ఎవ్వరూ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇలా గతంలో అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రానికి జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ విడుదలకు ముందే సోనీ లైవ్ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఎందుకో నిర్మాతలతో ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో స్ట్రీమింగ్ ని రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఆ సినిమాని ఏ ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అలాంటి అతి నీచమైన పరిస్థితి రజినీకాంత్ చిత్రానికి ఇప్పుడు రావడం శోచనీయం. ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా మన ముందుకు రానుంది.