Shirish : ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఫ్లాప్ తర్వాత నిర్మాత దిల్ రాజు(Dil Raju) కి ఏమైందో ఏమో తెలియదు తెలియదు కానీ, తాను పుట్టిన తర్వాతే నిజాయితీ పుట్టింది అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. నమ్మి నాలుగేళ్లు డేట్స్ ఇచ్చిన రామ్ చరణ్(Global Star Ram Charan) లాంటి పాన్ ఇండియన్ సూపర్ స్టార్ ని ఇప్పటికే గడిచిన మూడు నెలల్లో ఎన్నో విధాలుగా అవమానించాడు. నిన్న తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ ని అయితే నువ్వు నాకంటే సీనియర్ వి, ఇండస్ట్రీ కి వచ్చి 24 ఏళ్ళు అయ్యింది. నీ జూనియర్ ని అయినా నేను ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాను. కానీ ఇన్నేళ్లు అయినా నువ్వు పీకింది ఏమి లేదు అంటూ చెప్పుకొచ్చాడు. పాపం ఈ ఇంటర్వ్యూ లో నితిన్ ముఖం చిన్నబోయింది. దిల్ రాజు గారు, మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇకపోతే నిన్న ఈయన సోదరుడు శిరీష్ తన మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈయన చాలా ముక్కుసూటి మనిషి అట, మనసులో ఉన్నది ఉన్నట్టుగా నిజాలు చెప్పేస్తాడట,దాని వల్ల సమస్యలు వస్తాయని ఇన్ని రోజులు దిల్ రాజు అతన్ని మీడియా ముందుకు రానివ్వకుండా చేసాడట. ఈ విషయాన్ని స్వయంగా శిరీష్ నిన్నటి ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఇన్ని రోజులు బయటకు రానివ్వకుండా తన సోదరుడిని అడ్డుకున్న దిల్ రాజు, ఇప్పుడు ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడో ఆ దేవుడికే తెలియాలి. నిన్న ఒక్క ఇంటర్వ్యూ లో ఆయన రామ్ చరణ్ మీద ఏడ్చాడు, మైత్రీ మూవీ మేకర్స్ మీద ఏడ్చాడు, చివరకు సూపర్ స్టార్ రజనీకాంత్ మీద కూడా ఏడ్చాడు. ఇంతకు ఆయన రజనీకాంత్ మీద చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.
యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘ఇన్ని రోజులు మీరు, సునీల్ గారు చవకగా తమిళ డబ్బింగ్ సినిమాల రైట్స్ ని కొనుగోలు చేసారు కదా’ అని అంటాడు. అప్పుడు శిరీష్ సమాధానం చెప్తూ ‘రజనీకాంత్ పెద్దన్న చిత్రం కొనుగోలు చేసాము..మొత్తం పోయిందిగా. ఈమధ్య కాలం లో మేము కొనుగోలు చేసిన రజనీకాంత్ సినిమాలు మొత్తం ఫ్లాప్ అయ్యాయి ఒక్క జైలర్ తప్ప. కేవలం జైలర్ తోనే గతంలో పోయిన మా డబ్బులు మొత్తం వెనక్కి వచ్చేసాయా?,లేవుగా!’ అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోల గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడడం నిజంగా సాహసమే,కానీ ఇలా మాట్లాడినందుకు ఇక జీవితంలో రామ్ చరణ్ వీళ్ళతో సినిమా చేసే అవకాశం ఉండదు. రజనీకాంత్ తో భవిష్యత్తులో సినిమా చేసే ఛాన్స్ వచ్చినప్పుడు, ఈ వీడియో ని చూస్తే ఆయన కూడా దిల్ రాజు తో సినిమా చేయడానికి నిరాకరించే అవకాశాలు ఉన్నాయి.
We lost everything with #Peddanna, and Sun Pictures didn’t compensate us a single rupee. Except for #Jailer, every #Rajinikanth film we distributed ended in losses. pic.twitter.com/rCPGXqHXHV
— Telugu Chitraalu (@TeluguChitraalu) July 1, 2025