Jailer Collections : సౌత్ సినీ ఇండస్ట్రీలో దశాబ్దాలుగా స్టార్ ఇమేజ్ ను కాపాడుతూ వస్తున్న ఏకైక హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. అయన వయసు 70 దాటినా నేటి కుర్రాళ్లకు నచ్చే విధంగా సినిమాలు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. రజనీలేటేస్టుగా నటించిన‘జైలర్’ రిలీజ్ సందర్భంగా కొందరు కామెంట్ చేశారు. రజనీకి వయసు అయిపోయిందని, ఇక ఆయనకు రెస్ట్ అవసరమని కొందరు విమర్శించారు. ఈ విమర్శలు రజనీ వరకు చేరాయి. దీంతో ఆయన సినిమా ప్రమోషన్లో భాగంగా ‘విమర్శలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కానీ మనం చేసేది చేయాలి..’ అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ‘జైలర్’కు వచ్చిన కలెక్షన్లు చూసి విమర్శకులు ఇక నోరు మూసుకోవచ్చు… అని రజనీ ఫ్యాన్స్ అంటున్నారు.
2023 ఆగస్టు 10న రజనీ నటించిన ‘జైలర్’ తియేటర్లోక వచ్చింది. ఇందులో రజనీ సరసన తమన్నా నటించింది. వీరితో పాటు శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ, జాకిష్రాఫ్,సునీల్ తదితరులు నటించారు. సన్ పిక్యర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తమిళ స్టార్ మ్యూజిషియన్ అనిరుద్ సంగీతాన్ని అందించారు. కామెడీ, యాక్షన్ తో కలగలిపిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా 10 రోజులు దాటిని రజనీ సినిమా ‘జైలర్’ గురించే మాట్లాడుకుంటున్నారు.
సినిమా మొత్తాన్ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్ పరంగా తమిళనాడులో రూ.62 కోట్లు , తెలుగు రాష్ట్రాల్లో రూ.12కోట్లు బిజినెస్ అయింది. ఇక కర్ణాటకలో రూ.10 కోట్లు, కేరళలో రూ.5.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.3 కోట్లు అయింది. ఓవర్సీస్ లో రూ.30 కోట్లతో మొత్తం 122.50 కోట్లుఅయింది. రజనీ కాంత్ ఈ సినిమాలో కొత్తగా కనిపించడంతో పాటు సినిమా ట్రైలర్ బాగా ఆకట్టుకుంది. దీంతో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఈ నేపథ్యంలో సినిమాకు ఫస్ట్ రోజు నుంచే కలెక్షన్ల వరద మొదలైంది. 10 రోజుల్లో ఈ మూవీకి రూ.400 కోట్లకు పైగా వసూలైనట్లు తెలుస్తోంది. తెలుగురాష్ట్రాల్లో 1.8 కోట్ల షేర్ రాగా.. తమిళనాడులో 10వ రోజు రూ. 5 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక నుంచి రూ.5 నుంచి రూ.6 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రూ.5.5 కోట్లు గ్రాస్ అందుకుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. అన్నీ కలుపుకొని 10 రోజుల్లో రూ.470 కోట్లు పైగనే కలెక్షన్ రావొచ్చన్న చర్చ సాగుతోంది.