Coolie 2nd Day Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాత్మక ఓపెనింగ్ ని సొంతం చేసుకుందో మనమంతా చూశాము. మొదటి రోజు అక్షరాలా 161 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. తమిళనాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిల్చింది. ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందో లేదో ప్రస్తుతానికి చెప్పలేము. ఎందుకంటే ఆ స్థాయి వసూళ్లకు తగిన టాక్ ఈ చిత్రానికి రాలేదు కాబట్టి. కానీ రెండవ రోజు ఈ చిత్రానికి ఆన్లైన్ లో జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులకు మతిపోయింది. రెండవ రోజు ప్రారంభం కాకముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక రెండవ రోజు మొదలయ్యాక బుక్ మై షో తెరిచి చూస్తే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. హిందీ వెర్షన్ లో గంటకు 10 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి, అదే విధంగా తెలుగు, తమిళం, మలయాళం భాషలకు కలిపి గంటకు 37 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఓవరాల్ గా బుక్ మై షో లో ప్రస్తుతానికి గంటకు 47 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం రెండవ రోజు అన్ని భాషలకు కలిపి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంటున్నారు. అలా రెండు రోజుల్లో 260 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, లాంగ్ వీకెండ్ కి 450 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చాలా మంది హీరోలు ఫుల్ రన్ లో కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టలేదు.
Also Read: అభిమానుల నుండి నాగార్జునకి నిరసన సెగ.. వైజాగ్ లో బ్యానర్లు చింపేసారుగా!
ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి, రజినీకాంత్ ఇక్కడ మొదటి నుండి కింగ్. ఆయన కాంబినేషన్ తో వచ్చిన ప్రతీసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు అవుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. కేవలం ప్రీమియర్ షోస్ నుండి నార్త్ అమెరికా లో 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, మొదటి రోజు కూడా 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందట. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా లో 7.8 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. వీకెండ్ ముగిసేలోపు బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని, అంతటి అద్భుతమైన ట్రెండ్ నడుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.