Rajinikanth: అతనో తమిళ్ సూపర్ స్టార్. వయసు 75 ఏళ్ల.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లుకుపైనే. ఎన్నో డక్కామొక్కీలు తిని ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. కండక్టర్‌గా జీవితం స్టార్ట్ చేసిన అతను స్టార్ డైరెక్టర్ బాలచందర్ కంటపడి.. తన స్టార్‌ను కూడా మార్చుకున్నాడు. సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీనే ఏలే దశలో ఉన్నాడు. కానీ.. ఓ చిన్న విమర్శకు కంటతడి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇదే అటు తమిళ్, ఇటు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ సూపర్‌స్టార్ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును రజినీకాంతే.. ఆయన తాజాగా నటించిన లాల్ సలాం సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమంతోపాటు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ చెన్నైలో ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ కంటతడి పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్నేళ్ల ఇండస్ట్రీ అనుభవం ఉండి కూడా చిన్న విమర్శకు భావోద్వేగానికి లోనవడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో స్ట్రాంగ్ అనుకున్న రజినీ ఇలా కంటతడి పెట్టడం ఏంటన్న చర్చ ఇటు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో జరుగుతోంది.
ఏం జరిగిందటే..
చెన్నైలో నిర్వహించిన లాల్ సలాం సినిమా ప్రమోషన్ వేడుకలో రజీనీకాంత్ కూతురు ఐశ్వర్య మాట్లాడుతూ ఎమోషన అయ్యారు. కొంతమంది తన తండ్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నేను మీడియాకు దూరంగా ఉంటాను. కానీ నా తండ్రికి సంబంధించిన ఆరోపణలు, విమర్శలు నా దృష్టికి రావడంతో కోపం వచ్చింది. మేమూ మనుషులమే. నా తండ్రిని సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తిగా విమర్శిస్తున్నారు. నాన్న ఏ రాజకీయా పార్టీకి చెందిన వారు కాదు. మా నాన్న పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే మా పరిస్థితి ఇలా ఉండదు. ఆయనకు ఎంతో గౌరవం దక్కేది. మా నాన్న సంఘ్ పరివార్‌కు చెందినవాడైతే లాల్ సలామ్ సినిమా ఎందుకు చేస్తారు’ అని ప్రశ్నించారు.
రజిని కంట నీరు..
వేదికపై ఐశ్వర్య మాటలు విన్న రజినీకాంత్.. కూడా భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిపర్యంతమయ్యారు. ఇది చూసి రజినీ అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. వాస్తవానికి ఇది చాలా చిన్న విషయం. గతంలో ఇలాంటి విమర్శలు ఎన్నో ఎదుర్కొని ఉంటారు. కానీ, ఇప్పుడు కంటతడి ఎందుకు పెట్టారన్నదే చర్చ. ఏనుగు దారిన పోతుంటే కుక్కలు మొరగక మానవు. అంత మాత్రాన ఏనుగుకు ఎలాంటి నష్టం జరుగదు. ఈ విషయం తెలిసి కూడా రజినీకాంత్ కంటతడి పెట్టడం దేనికన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూతురు భావోద్వేగం చూసి, కూతురుపూ ఉన్న ప్రేమ ఇలా రజినీ కంట కన్నీరై ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.