https://oktelugu.com/

Rajini Kanth సూపర్ స్టార్ ‘పెద్దన్న’ మూవీ నుంచి మోషన్ పోస్టర్ విడుదల…

Rajini Kanth తెలుగు తమిళ రాష్ట్రాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే పండగ. సూపర్ స్టార్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. ఇటీవల విడుదలైన “అన్నాత్తే” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.తెలుగులో విజయ దశమి సందర్భంగా ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 06:34 PM IST
    Follow us on

    Rajini Kanth తెలుగు తమిళ రాష్ట్రాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే పండగ. సూపర్ స్టార్ మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. ఇటీవల విడుదలైన “అన్నాత్తే” ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.తెలుగులో విజయ దశమి సందర్భంగా ‘పెద్దన్న’ టైటిల్‌ ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది సినిమా యూనిట్.అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.‘పెద్దన్న’ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

    రజనీకాంత్‘’పెద్దన్న’గా రాయల్ ఎన్‌ఫీల్డ్ పై వస్తోన్న లుక్ సూపర్ స్టార్ మాస్ ని ఉట్టిపడేలా చేస్తుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ ‌ను విడుదల చేశారు.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన నయనతార, మీనా, కుష్బూ కథానాయికలుగా నటించారు. సూపర్ స్టార్ పక్కా మాస్ లుక్ లో ఈయన్ని చూపించారు దర్శకుడు శివ. ఈ సినిమాలో రజినీకాంత్ నడిచొస్తుంటే పక్కన దీవాళికి టపాకాయలు పేల్చినట్లు. బాంబులతో వ్యాన్స్ పేల్చడం హైలైట్ అనిపిస్తుంది. సినిమా అంతా పక్కా విలేజ్ మాస్ డ్రామా అనేది అర్థమవుతుంది. పెద్దన్నగా సూపర్ స్టార్ ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటారో చూడాలి మరి.

    అన్నాత్తే సినిమకు ఇంట్రడక్షన్ సాంగ్స్ ఎస్పీ బాలు పాడారు. గతేడాది సమ్మర్‌లోనే సంగీత దర్శకుడు ఇమాన్ అన్నాత్తే పాటల రికార్డింగ్ పూర్తి చేసారు. తెలుగు వెర్షన్ ‘పెద్దన్న’ సాంగ్‌ను కూడా ఎస్పీ బాలు గారు ఆలపించారట. త్వరలో ఈ పాటను విడుదల చేయనున్నారు. తమిళ్ లో టీజర్ మరియ టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో పెద్దన్న కు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.