Rajinikanth Kamal Haasan Film News: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు గా కొనసాగుతున్న రజినీకాంత్ కమల్ హాసన్ ల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా భారీ మార్కెట్ ఉంది. వాళ్లిద్దరి ఇమేజ్ ని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకులు ఎవరు లేరనే ఉద్దేశ్యంతో చాలా రోజుల నుంచి వాళ్ళ కాంబినేషన్లో సినిమా వస్తుంది అని చెబుతున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు నెల్సన్ డైరెక్షన్ లో వీళ్ళిద్దరు సినిమా చేయబోతున్నారనే విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక దాంతో పాటుగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.
నిజానికి నెల్సన్ కమర్షియల్ సినిమాలను చాలా బాగా హ్యాండిల్ చేయగలడు అనే పేరైతే తనకి ఉంది. జైలర్ సినిమాతో రజనీకాంత్ కి సాలిడ్ సక్సెస్ ని అందించిన ఆయన ‘జైలర్ 2’ సినిమాని సైతం భారీ సక్సెస్ గా మలచాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరి ఇమేజ్ ను మేనేజ్ చేయగలిగే కెపాసిటి నెల్సన్ కి ఉందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక వీళ్లను హ్యాండిల్ చేయడంలో నెల్సన్ ఈ మాత్రం నిర్లక్ష్యం వహించిన కూడా ఇద్దరి అభిమానుల నుంచి విమర్శలను ఎదుర్కొనే అవకాశమైతే ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి మరి ఇద్దరి ఇమేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ సినిమాను చేయాల్సిన అవసరమైతే ఉంది…
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు తమ సత్తా చాటుకుంటుంటే నెల్సన్ మాత్రం ఇలా వీళ్ళిద్దరికి బుక్ అయ్యాడు ఏంటి అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికైతే వీళ్లిద్దరి ఇమేజ్ ని మేనేజ్ చేయడం అనేది కత్తి మీద సామ్ లాంటిది. అది ఏమాత్రం తేడా కొట్టిన కూడా నెల్సన్ కి భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి..