Homeఎంటర్టైన్మెంట్Rajendra Prasad - SV Krishna Reddy : రాజేంద్ర ప్రసాద్ తో ఎస్వీ కృష్ణారెడ్డికి...

Rajendra Prasad – SV Krishna Reddy : రాజేంద్ర ప్రసాద్ తో ఎస్వీ కృష్ణారెడ్డికి గొడవ ఎలా వచ్చిందంటే?

Rajendra Prasad – SV Krishna Reddy : ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశాడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఒక సినిమాకు అత్యధిక క్రాఫ్ట్స్ కి పని చేసిన ఘనత ఆయనది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం అందించేవారు. హీరోగా కూడా చేశాడు. బహుశా ఎస్వీ కృష్ణారెడ్డి రికార్డు మరొక దర్శకుడికి ఉండదేమో. మూడు దశాబ్దాలకు పైగా కెరీర్లో కృష్ణారెడ్డి 43 చిత్రాలు చేశారు. చిన్న, మీడియం రేంజ్ హీరోలతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. కమెడియన్ గా ఉన్న అలీ తో యమలీల చేయడం ఒక సాహసం. యమలీల నాటికి ఎస్వీ కృష్ణారెడ్డికి స్టార్ డైరెక్టర్ హోదా వచ్చేసింది.

అలీ హీరోగా యమలీల చేస్తున్నారని తెలిసి పలువురు స్టార్ డైరెక్టర్స్ ఎస్వీ కృష్ణారెడ్డికి కాల్ చేశారట. అలీ హీరోగా మూవీ చేయడం ఏమిటీ? మేము చేస్తామని అన్నారట. అయినప్పటికీ ఎస్వీ కృష్ణారెడ్డి తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడట. అలీ చేస్తేనే ఆ పాత్ర పండుతుంది అన్నారట. యమలీల బ్లాక్ బస్టర్ కాగా, అలీ 50కి పైగా సినిమాలు హీరోగా చేయడానికి ఆ మూవీ పునాది వేసింది.

అలీ తో పాటు రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి హీరోలకు కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చాడు ఎస్వీ కృష్ణారెడ్డి. రాజేంద్ర ప్రసాద్ నటించిన కొబ్బరి బొండాం చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించాడు ఎస్వీ కృష్ణారెడ్డి. అనంతరం రాజేంద్రుడు గజేంద్రుడు మూవీతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా రెండో సినిమా మాయలోడు సైతం రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించారు. ఇది కూడా సూపర్ హిట్. అయితే మాయలోడు సినిమా సమయంలో ఇద్దరికీ మధ్య విబేధాలు తలెత్తాయనే వాదన ఉంది. అందుకే చాలా కాలం వీరు కలిసి పని చేయలేదని టాలీవుడ్ టాక్.

ఓ సందర్భంలో ఈ విషయం పై ఎస్వీ కృష్ణారెడ్డి స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ తో మీకు గొడవేంటి అని యాంకర్ అడగ్గా.. ఆయన వివరణ ఇచ్చారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీ సమయంలో కూడా సమస్యలు వచ్చాయి. మాయలోడు సినిమా విషయంలో జరిగిందే ఇప్పుడు కూడా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ మంచి వ్యక్తి. కాకపోతే ఎక్కడో చిన్న తిక్క ఉంటుంది. ఇగో కావచ్చు. ప్రతిదీ చెప్పి చేయించుకోవాలి. తేలిగ్గా వినడు.. అని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నాడు. విబేధాలు తలెత్తిన మాట వాస్తవమే అని ఒప్పుకున్నారు.

RELATED ARTICLES

Most Popular