Rajasekhar Daughter Shivatmika: తెలుగు చలనచిత్ర రంగంలో జీవిత రాజశేఖర్ ది అచ్చొచ్చిన జంట. ఇద్దరు కలిసి సినిమాలు తీశారు. జీవితాన్ని పంచుకున్నారు. చివరకు జీవిత రాజశేఖర్ గా మిగిలారు. వారికి ఇద్దరు కూతుళ్లు. ఒకరు శివాని, మరొకరు శివాత్మిక. ఇందులో శివాత్మిక హీరోయిన్ గా రాణిస్తోంది. మొదటి సినిమా దొరసానిలో తనదైన నటనతో విజృంభించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టింది. అంతే కాదు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలు షేర్ కుర్రకారును సైతం మత్తెక్కిస్తోంది.
ఏ హీరోయిన్ అయినా మొదట అందాల ఆరబోత. తరువాత సినిమాల్లో గ్లామర్ చూపించడం మామూలే. ఈ నేపథ్యంలో శివాత్మిక తన అందాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటోంది. తన ఫొటోలను షేర్ చేస్తూ వారికి పిచ్చెక్కిస్తోంది. అందాలున్నది ఆరబోయడానికే అన్నట్లు గా ఆమె ఫొటోలు తెగ వైరల్ అవుతుంటాయి. అభిమానుల నుంచి స్పందన కూడా అదే రేంజ్ లో ఉండటం గమనార్హం. దీంతో ఆమె రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో తన ఫొటోలు తెగ వైరల్ చేస్తోంది.

శివాత్మిక జీ5లో ప్రసారమయ్యే అహనా పెళ్లంట వెబ్ సిరీస్ లో నటిస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. అలాగే పంచతంత్రంలో కూడా నటిస్తోంది. ఇది తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇంకా ఆకాశం అనే మరో సినిమా కూడా చేస్తోంది. దీంతో బిజీగా ఉండే శివాత్మిక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు సందడిగానే ఉంటోంది. తన ఫొటోలు పోస్టు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటోంది. శివాత్మిక రాజశేఖర్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
శివాత్మిక హాట్ హాట్ అందాలతో కనువిందు చేస్తోంది. డార్క్ రూంలో ఆమె దిగిన ఓ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన అందంతో మత్తెక్కిస్తోంది. కుర్రకారును హుషారెక్కిస్తోంది. హీరోయిన్లకు ఉండే లక్షణాలన్ని శివాత్మికలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆమె ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి వాటిలో బిజీగా ఉంటోంది. తన ఫొటోలు పోస్టులు పెడుతూ ప్రేక్షకుల స్పందన చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. సో శివాత్మిక మరిన్ని ఫొటోలు పెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
